Realme 12 Pro Plus Vs Realme 12 Pro: ఈ రెండింటిలో అతి శక్తివంతమైన మొబైల్‌ ఇదే..ఫీచర్స్‌ అన్ని అదుర్స్!

Realme 12 Pro Plus Vs Realme 12 Pro: ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 12 ప్రో ప్లస్, 12 ప్రో సిరీస్ లకు మంచి డిమాండ్ లభించింది. అతి తక్కువ ధరకే లభించడంతో చాలామంది ఈ మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో తెలియక తికమక పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2024, 07:58 AM IST
Realme 12 Pro Plus Vs Realme 12 Pro: ఈ రెండింటిలో అతి శక్తివంతమైన మొబైల్‌ ఇదే..ఫీచర్స్‌ అన్ని అదుర్స్!

 

Realme 12 Pro Plus Vs Realme 12 Pro: ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ రియల్ మీ మొబైల్ కి మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏడాది ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ నాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూ వస్తోంది. అంతేకాకుండా మార్కెట్లోని సాధారణ కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ ను కూడా అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. అయితే ఇటీవలే మార్కెట్లోకి రియల్ మీ విడుదల చేసిన 12 ప్రో ప్లస్, 12 ప్రో స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తుండడంతో మంచి గుర్తింపు లభించింది. అయితే చాలామంది ఈ రెండు మొబైల్స్ లో దేనిని కొనుగోలు చేయాలో అని తికమక పడుతున్నారు. వీటి రెండింటిలో ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ధర పరంగా ఏది బెస్తో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ 12 ప్రో ప్లస్, 12 ప్రో స్మార్ట్ ఫోన్స్ ను ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ రెండు మొబైల్స్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అతి శక్తివంతమైన 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇక ప్రో ప్లస్ డిస్ప్లే విషయానికొస్తే ప్రో కంటే కొంత మెరుగైందిగా చెప్పవచ్చు. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ప్రాసెసర్ విషయానికొస్తే..రియల్‌మీ 12 ప్రో లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉండగా, రియల్‌మీ 12 ప్రో ప్లస్ లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో ప్లస్ వేరియంట్ వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుంది. 

రియల్ మీ కంపెనీ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ను అతి శక్తివంతమైన కెమెరాలతో విడుదల చేసింది. ఇవి రెండు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ సెటప్ తో అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మీ 12 ప్రో ప్లస్ లో 200MP ప్రధాన కెమెరా ఉండగా రియల్‌మీ 12 ప్రో లో 108MP సెన్సార్ ఉంటుంది. అలాగే ప్రో ప్లస్ లో మెరుగైన టెలిఫోటో లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల కెమెరా విషయానికొస్తే ప్రో ప్లస్ వేరియంట్ చాలా మెరుగైందని చెప్పవచ్చు.

Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఇక ఈ రెండు మొబైల్స్ బ్యాటరీ విషయానికొస్తే..రెండు ఫోన్లలోను 5000mAh బ్యాటరీ సెట్ అప్ తో అందుబాటులోకి వచ్చాయి. కానీ రియల్‌మీ 12 ప్రో ప్లస్ లో 120W ఫాస్ట్ చార్జింగ్ ఉండగా, రియల్‌మీ 12 ప్రో లో 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. అంతేకాకుండా రియల్‌మీ 12 ప్రో ప్లస్ లో వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ ఉంది. అలాగే ప్రో ప్లస్ లో డోల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇక ఈ రెండు మొబైల్స్ ధర వివరాల్లోకి వెళితే..రియల్‌మీ 12 ప్రో స్మార్ట్ ఫోన్ రూ. 23 వేల లోపు అందుబాటులో ఉండగా.. ప్లస్ వేరియంట్ మాత్రం 28 వేల లోపు లభిస్తోంది. ధర పరంగా చూస్తే ప్లస్ వేరియంట్ కంటే ప్రోవేరియంట్ చాలా తక్కువ ధరతో లభిస్తుంది. ఇక ఫీచర్ల పరంగా కూడా ప్లస్ వేరియంట్ ముందుంది కాబట్టి కాస్త ధర ఎక్కువ.. ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ప్రో ప్లస్ వేరియంట్ తీసుకుంటే కొన్ని బెనిఫిట్స్ లభిస్తాయి.

Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News