Poco M6 5G Price Down: మరోసారి భారీగా తగ్గిన Poco M6 5G మొబైల్ ధర.. ఒక్కసారిగా పెరిగిన విక్రయాలు..

Poco M6 5G Price Down: అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశం.. పోకో ఇటీవలే విడుదల చేసిన M సిరీస్ మొబైల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 11:04 PM IST
Poco M6 5G Price Down: మరోసారి భారీగా తగ్గిన Poco M6 5G మొబైల్ ధర.. ఒక్కసారిగా పెరిగిన విక్రయాలు..

 

Poco M6 5G Price Down: ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లపై మొబైల్ బోనంజ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌ని కొనుగోలు చేస్తే దాదాపు 25 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే ప్రీమియం కంపెనీలకు సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ముఖ్యంగా గత సంవత్సరంలో విడుదలైన కొత్త మోడల్స్ పై ఏకంగా 25 శాతం ఫ్లాట్ తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌ విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 

అతి తక్కువ ధరతో ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌ పోకో ఇటీవల విడుదల చేసిన M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా POCO M6 మోడల్ పై దాదాపు 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,999 కాగా.. మొబైల్ బోనంజ సేల్‌లో భాగంగా 25% ఫ్లాట్ డిస్కౌంట్ కేవలం రూ. 10,499కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే..రూ.525 వరకు తగ్గింపు లభిస్తుంది.
    
దీంతోపాటు మొబైల్ బోనాంజా సేల్‌లో భాగంగా ఈ POCO M6 5G మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ని వినియోగించడానికి ముందుగా మంచి కండిషన్ కలిగిన మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 5 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ కొత్త మొబైల్ రూ. 5,599కే పొందవచ్చు. దీంతోపాటు అదనంగా వన్ ఇయర్ వరకు మ్యానుఫ్యాక్చర్ వారంటీని కూడా అందిస్తోంది. అలాగే ఈ POCO M6 5G మొబైల్ పై పోకో కంపెనీ కంప్లీట్ ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News