Poco Smartphones: 108MP కెమేరా 256 GB స్టోరేజ్ 12జీబీ Ram సూపర్ స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకే

Poco Smartphones: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో POCO క్రమంగా విస్తరిస్తోంది. అద్బుతమైన ఫీచర్లు, డిజైన్ కలిగి ఉండటమే కాకుండా తక్కువ బడ్జెట్‌లో లభిస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో పోకో నుంచి Poco X6 Neo 5G లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2024, 07:45 AM IST
Poco Smartphones: 108MP కెమేరా 256 GB స్టోరేజ్ 12జీబీ Ram సూపర్ స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకే

Poco Smartphones: Poco X6 Neo 5G స్మార్ట్‌పోన్ ఇండియన్ మార్కెట్‌లో ఇటీవల లాంచ్ అయింది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో మార్చ్ 18 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. 108 మెగాపిక్సెల్‌తో కళ్లు చెదిరే కెమేరా, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటమే కాకుండా అత్యంత స్లిమ్ ఫోన్లుగా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 

పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌లలో ఉన్నాయి. ఈ ఫోన్ 6.67 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటంతో అంత త్వరగా డ్యామేజ్ కాదు. ఇందులో గ్రాఫైట్ ప్లేట్స్ ఉండటం వల్ల గేమింగ్ సమయంలో వేడెక్కకుండా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ఉంటుంది. గరిష్టంగా 12 జీబీ కావడంతో ఈ ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. వర్చువల్‌గా అయితే 24 జీబీ వరకూ విస్తరించవచ్చు. 

ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా 2 ఏళ్లుపాటు ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కంపెనీ అందిస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్‌లాక్ ఈ ఫోన్‌లో మరో ప్రధాన ఆకర్షణ. ఇక కెమేరా విషయంలో తిరుగులేదు. 3ఎక్స్ జూమింగ్ కలిగిన 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

పోకో ఎక్స్ 6 నియో 5జి స్మార్ట్‌ఫోన్‌లో 5.3 బ్లూ టూత్, వైపై 802, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్డర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అదనపు ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇక ధర కూడా అందుబాటులోనే ఉంది. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 15,999 రూపాయలుగా ఉంది. అదే 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 17,999 రూపాయలు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరో 1000 రూపాయలు తగ్గుతుంది. ఇక సేల్ ప్రమోషన్‌లో భాగంగా మొదటి 1000 మంది కొనుగోలుదారులకు 1000 రూపాయల విలువైన మింత్రా కూపన్లు లభిస్తాయి. 

Also read: 5G Phones under 10K: 5జి ఫోన్ కోసం చూస్తున్నారా, 10 వేలకే లబించే టాప్ 3 స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News