Oppo A38 Price Cut: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌ ధరకే Oppo A38 మొబైల్‌ పొందండి.. రూ.9,450 డిస్కౌంట్!

Oppo A38 Price Cut: అతి తక్కువ ధరలోనే ఒప్పో ఇటీవలే విడుదల చేసిన Ai కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 20, 2024, 09:33 PM IST
Oppo A38 Price Cut: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌ ధరకే Oppo A38 మొబైల్‌ పొందండి.. రూ.9,450 డిస్కౌంట్!

 

Oppo A38 Price Cut: మార్కెట్‌లో తక్కువ ధరలో లభించే ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే చాలా మొబైల్ కంపెనీలు ఎక్కువ మెగాపిక్సెల్ కలిగిన మొబైల్స్ అతి తక్కువ ధరకే లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఒప్పో లాంటి మల్టీ నేషనల్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌లో ప్రీమియం ఫీచర్స్ కెమెరాలతో అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్ ను లాంచ్ చేయడంతో, చాలామంది ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ముగ్గు చూపుతూ ఉంటారు.

ఇటీవలే ఒప్పో మార్కెట్‌కి లాంచ్ చేసిన A38 మోడల్ స్మార్ట్ ఫోన్‌కి మంచి గుర్తింపు లభించింది. ఇది 50 ఎంపీ ఏఐ కెమెరాతో అందుబాటులోకి రావడంతో కెమెరా లవర్స్ అంతా ఈ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మీరు కూడా ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలు లభిస్తుంది అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. దీనిని ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. మార్కెట్‌లో ఈ ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ ధర MRP రూ.16,999కి అందుబాటులో ఉంది. దీనిని ప్రత్యేకమైన సేల్‌లో కొనుగోలు చేసే వారికి 41 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,999కే పొందవచ్చు. 

ఈ ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.999 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన తగ్గింపు అందుబాటులో ఉంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇవే కాకుండా ఈ ఒప్పో A38 మొబైల్‌పై ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి రూ.9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ ఒప్పో A38 స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 500లోపే పొందవచ్చు. దీంతోపాటు ఈ మొబైల్ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News