Oneplus: వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11R లాంచ్ డేట్ ఎప్పుడు, ప్రత్యేకతలేంటి

Oneplus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి మరో రెండు సూపర్ మోడల్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. కొత్త ఏడాదిలో వన్‌ప్లస్ నుంచి ఆవిష్కృతం కానున్న మోడల్స్ ఇవే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 11:22 PM IST
Oneplus: వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11R లాంచ్ డేట్ ఎప్పుడు, ప్రత్యేకతలేంటి

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11ఆర్ లాంచ్ షెడ్యూల్ అయింది. కొత్త ఏడాదిలో అంటే ఫిబ్రవరిలో వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11ఆర్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ధర, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

వన్‌ప్లస్ 11 ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ కానుంది. ఫిబ్రవరిలో కొత్త ఏడాది కానుకగా లాంచ్ అవుతోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. వన్‌ప్లస్ 11లో ఎలర్ట్ స్లైడర్ తిరిగి ప్రవేశపెట్టనున్నారు. హేజిల్‌బ్లాడ్ టెక్నాలజీ సహాయంతో కెమేరా అద్భుతంగా ట్యూన్ అయి ఉంటుంది. ఇదే సమయంలో వన్‌ప్లస్ 10 ఆర్ కూడా లాంచ్ కానుంది. 

ధర ఎంత

వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11 ఆర్ ధరపై కొన్ని అంచనాలున్నాయి. కంపెనీ నుంచి అధికారికంగా ధర ఎంతనేది ఇంకా వెల్లడి కాలేదు. కానీ వన్‌ప్లస్ 11 ధర ఇండియాలో 55 వేలు, వన్‌ప్లస్ 11R ధర 65 వేలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక వన్‌ప్లస్ 10టిను వన్‌ప్లస్ 11ఆర్ రీప్లేస్ చేయనుంది. 

వన్‌ప్లస్ 11 ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 11 కేమేరాలు హేజిల్‌బ్లాడ్ టెక్నాలజీతో ట్యూన్ అయుంటాయి. గతంలోని ఫోన్ల కెమేరాలు ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌గా ఉన్నాయి. వన్‌ప్లస్ కంపెనీ ఇప్పటివరకూ కెమేరా సెన్సార్ ప్రత్యేకతల్నిరివీల్ చేయలేదు. కానీ మెయిన్ కెమేరా 50 మెగాపిక్సెల్ ఉండవచ్చని అంచనా. అదే సమయంలో సెకండరీ అల్ట్రావైడ్ సెన్సార్ 48 మెగాపిక్సెల్, టెరిషియరీ టెలీఫోనో సెన్సార్ 32 మెగాపిక్సెల్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 

ఇతర ప్రత్యేకతలు పరిశీలిస్తే..వన్‌ప్లస్ 11 6.7 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 3216×1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. హెచ్‌డీఆర్ 10 ప్లస్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ కలిగి ఉంది. వీటిలో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 4870 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం దీని ప్రత్యేకత. వన్‌ప్లస్ 11 బ్లాక్, గ్రీన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. 

Also read: LIC Plans: ప్రీమియం ఒక్కసారి చెల్లించి..నెలనెలా 20 వేలు పెన్షన్ తీసుకునే ఎల్ఐసీ పాలసీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News