Mobiles Get Dead Cheap Price: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 50 శాతం తగ్గింపుతో లభించే స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే!

Mobiles Get Dead Cheap Price: త్వరలోనే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ క్లోజ్‌ కాబోతోంది. దీంతో కొన్ని స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ కింది స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.     

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 09:57 AM IST
Mobiles Get Dead Cheap Price: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 50 శాతం తగ్గింపుతో లభించే స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే!

Mobiles Get Dead Cheap Price: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలోనే ముగియబోతోంది. ఈ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ తగ్గింపుతో అందిస్తోంది. అతి తక్కువ ధరతో బ్రాండెడ్‌ స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో యాపిల్, రెడ్‌మీ, రియల్‌ మీ బ్రాండ్‌ మొబైల్స్‌పై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై బ్యాంక్‌  ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలకు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అతి తక్కువ ధరకే లభించే మొబైల్స్‌:
యాపిల్‌ ఐఫోన్‌ 13 (Apple iPhone 13):

అమెజాన్‌లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భాగంగా యాపిల్‌ ఐఫోన్‌ 13 (Apple iPhone 13) మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఈ సేల్‌లో అన్ని ఆఫర్స్‌ పోను యాపిల్‌ ఐఫోన్‌ 13ను రూ.48,749కే పొందవచ్చు. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే..6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ 12MP డ్యూయల్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 

Redmi 12 5G:
అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా Redmi 12 5G స్మార్ట్ ఫోన్‌ కూడా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ MRP  ధర రూ.19,999కు అందుబాటులో ఉండగా ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ.10,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు.    

Realme Narzo 60x 5G:
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Realme Narzo 60x 5Gపై ఎప్పుడు పొందలేనంత డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా రూ.10,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. రియల్‌ మీ Narzo 60x 5G శక్తివంతమైన 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ MediaTek Helio G85 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Realme Narzo N53:
ఈ అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో Realme Narzo N53 స్మార్ట్ ఫోన్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో Realme Narzo N53 మొబైల్‌ను అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.7,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News