Mercury Transit 2023 Bad Effects On Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలకు, తిరోగమనాలకు ప్రత్యేక ప్రముఖ్య ఉంటుంది. కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల వ్యక్తుల జీవితాల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయి. అయితే ఈ మార్పులు వ్యక్తుల జాతకాల్లో గ్రహాలు సంచారం చేసే స్థానాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల జాతకాల్లో అనుకూల స్థానాల్లో గ్రహం రాశి సంచారం చేస్తే వక్తిగత జీవితల్లో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే ప్రతికూల స్థానాల్లో రాశి సంచారం చేస్తే వ్యక్తి అనేక రకాల దుష్ప్రభావాల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిణులు తెలుపుతున్నారు..
జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రముఖ్యత కలిగిన బుధగ్రహం సింహ రాశిలో 2 రోజుల పాటు ప్రత్యేక్షంగా తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ గ్రహం ప్రత్యక్ష తిరోగమనం ఏయే రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశివారికి బుధుడి తిరోగమనం కారణంగా మనసిక సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. బుధుడి తిరోగమనంతో కుటుంబంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి అంతేకాకుండా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచిది. లేకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్
వృషభ రాశి వారిపై కూడా బుధ గ్రహ తిరోగమన చెడు ప్రభావం పడబోతోంది. దీంతో ఈ రాశి వారు బాగోద్వేగానికి గురవుతారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ చేసే సమయంలో గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకుంటే ఎంతో మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర ఇబ్బందుల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. అయితే మీరు కష్టపడి పనిచేయడం వల్ల ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి వారికి కూడా బుధ గ్రహ తిరోగమనం చెడు ప్రభావం పడబోతోంది. ఈ రాసి వారు తప్పకుండా ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మానసిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఏ పని చేసిన ఫలితం కోసం ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి ఆర్థిక సంపదను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.స్నేహితుల మద్దతు లభించి అన్ని రకాల పనుల్లో వీరు సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే వీరు పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి