Meizu 21 Pro Price: ఐఫోన్‌ 15ను మించిన శక్తివంతమైన 1TB స్టోరేజ్‌తో కొత్త ఫోన్‌ వచ్చేసింది..ఫ్రీగా AI ఫీచర్స్‌ కూడా..

Meizu 21 Pro Price And Specifications: ప్రముఖ టెక్‌ కంపెనీ Meizu మార్కెట్‌లోకి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం AI ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల ఫీచర్స్‌ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2024, 11:01 AM IST
Meizu 21 Pro Price: ఐఫోన్‌ 15ను మించిన శక్తివంతమైన 1TB స్టోరేజ్‌తో కొత్త ఫోన్‌ వచ్చేసింది..ఫ్రీగా AI ఫీచర్స్‌ కూడా..

Meizu 21 Pro Price And Specifications: విదేశి టెక్‌ మార్కెట్‌లో Meizu కంపెనీ ఎంత డిమాండ్‌ ఉందో అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసే ప్రతి స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం లుక్‌తో పాటు కొత్త స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటాయి. అయితే ఈ టెక్‌ కంపెనీ ఇటీవలే విదేశీ మార్కెట్‌లో మరో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌  Meizu 21 Pro మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ కంపెనీ గతంలో లాంచ్‌ చేసిన Meizu 21 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే ఈ మోడల్‌లో అనేక రకాల అప్‌గ్రేడ్ ఫీచర్స్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది సరికొత్త డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన   6.79 అంగుళాల BOE డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని స్క్రీన్‌ రిజల్యూషన్‌ను 2K వీడియోకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల ఫీచర్స్‌ లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Meizu 21 Pro స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు:
ఈ Meizu 21 Pro స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌లో మార్కెట్‌లో లభిస్తోంది. దీని ధర చైనాలో 4999 యూవన్లు (భారత్‌లో సుమారు రూ.58,000), అలాగే 16GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌ ధర 5399 యూవన్లు (సుమారు రూ. 62,000)తో లభిస్తోంది. దీంతో పాటు కంపెనీ16GB ర్యామ్‌, 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన మోస్ట్‌ టాప్ వేరియంట్‌ను కూడా మార్కెట్‌ల్‌లోకి అందుబాటులో తెచ్చిది. దీని ధర భారత మార్కెట్‌లో సుమారు రూ.67,000 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ మొబైల్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టార్రీ నైట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్స్‌ ప్రీమియం లుక్‌లో కనిపిప్తాయి. 

ఫీచర్స్‌,స్పెసిఫికేషన్స్:
ఈ Meizu 21 Pro స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన 6.79-అంగుళాల BOE డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫ్రాంట్‌ భాగంలో పంచ్ హోల్ డిజైన్‌తో వచ్చింది. ఇది 1250 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను ఇస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. దీని బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే..ఇది నిలువులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌ లెన్స్, రెండవది 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్‌, మూడవది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 30X డిజిటల్ జూమ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులో OISతో పాటు EIS ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్‌ సెటప్‌లో ఉన్న ప్రధాన కెమెరా 8K వరకు వీడియోలను రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3తో 16 GB ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇందులో కంపెనీ అదనంగా VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు 5,050mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఎంతో శక్తివంతమైన కొన్ని  AI ఫీచర్లను కూడా కంపెనీ ఫ్రీగా అందిస్తోంది. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News