Kanuma Rasi Phalalu: ఈ రాశుల వారికి కనుమ పండుగ జీవితంలో గుర్తుండిపోయే లాభాలను ఇవ్వబోతోంది..వీరికి లాభాలే లాభాలు..

Kanuma Rasi Phalalu 2024: కుజ గ్రహ సంచారం ఈరోజు రాత్రి 11 గంటలకు జరగబోతోంది. ఈ సంచారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 16, 2024, 10:43 AM IST
Kanuma Rasi Phalalu: ఈ రాశుల వారికి కనుమ పండుగ జీవితంలో గుర్తుండిపోయే లాభాలను ఇవ్వబోతోంది..వీరికి లాభాలే లాభాలు..

Kanuma Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో పూజ గ్రహం చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు ఈ గ్రహాన్ని ధైర్యం సాహసానికి కారణంగా  భావిస్తారు. జాతకం ప్రకారం ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే శారీరికంగా మానసికంగా బలం చేకూరుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పూజ గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. కుజ గ్రహం జనవరి 16వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారిపై కుజ గ్రహ ప్రభావం పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
ధనస్సు రాశిలోకి కుజుడు సంచారం చేయడం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతోపాటు వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక ఎప్పటినుంచో విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. కుజుడు సంచార సమయంలో ఏ పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పనుల్లో సంతృప్తి పొందుతారు ఇక ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
 
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కుజుడి సంసారం ఫలప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాల్లో మంచి పేరు లభించి గుర్తింపు పొందుతారు. ఇక ఆదాయ విషయానికొస్తే ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు పెరిగి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రణాళికలు వేయడం వల్ల సక్సెస్ అయ్యే  ఛాన్స్ ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కుటుంబం మద్దతు లభించి ఆర్థికంగా బలపడతారు. కుజుడి సంచారం వల్ల వైవాహిక జీవితంలో మార్పులు కూడా వస్తాయి.

సింహ రాశి:
కుజుడి సంచార ప్రభావం సింహ రాశి వారిపై కూడా ఈరోజు నుంచి పడబోతోంది. దీని కారణంగా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి జీవితంలో ఊహించని ఆనందం ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికొస్తే ఈ సమయం చాలా బాగుంటుంది. కాబట్టి కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుజుడి సంచారం సింహ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలను అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఎప్పటినుంచో కొనసాగుతున్న వివాదాలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ముఖ్యంగా కొంతమంది విదేశాల నుంచి జాబ్ ఆఫర్స్ కూడా పొందుతారు.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి కుజుడు సంచార ప్రభావం అనుకోని ప్రయోజనాలను కలిగించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ధైర్యం బలం విశ్వాసంతో నిండి ఉంటారు. దీని కారణంగా కెరీర్లో మంచి సక్సెస్ పొందుతారు. వివాహాల కోసం ఎదురుచూస్తున్న వారికి సంబంధాలు కూడా ఫిక్స్ అవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని అనుకోని శుభవార్తలు కూడా పొందుతారు. కుటుంబ జీవితం గడుపుతున్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరిగి అనుకోని ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News