iQOO Neo 9 Pro 5G Price Cut: మరీ ఇంత చీపా..మొబైల్‌ పౌచ్‌ ధరకే iQOO Neo 9 Proను పొందండి!

iQOO Neo 9 Pro 5G Price Cut: అతి తక్కువ ధరకే గేమింగ్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన iQOO Neo9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అతి చౌకగా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 21, 2024, 02:51 PM IST
iQOO Neo 9 Pro 5G Price Cut: మరీ ఇంత చీపా..మొబైల్‌ పౌచ్‌ ధరకే iQOO Neo 9 Proను పొందండి!

iQOO Neo 9 Pro 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వీవో(Vivo) అనుబంధ కంపెనీ iQOO గేమింగ్‌ మొబైల్స్‌కి భారత్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. కంపెనీ శక్తివంతమైన ప్రాసెసర్లతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. ఇటీవలే iQOO మిడ్‌ రేంజ్‌లో లాంచ్‌ చేసిన iQOO Neo9 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి మంచి గుర్తింపు లభించింది. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా ఎంతో సక్సెస్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ అమెజాన్‌ ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా iQOO Neo9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై లభిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటి సేల్‌లో ఎన్నో లాభాలు:
అమెజాన్‌లోని మొదటి సేల్‌లో భాగంగా iQOO Neo 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మూడవది 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన ఈ iQOO Neo 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.41,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 12 శాతం తగ్గింపుతో కేవలం రూ.36,999తో లభిస్తోంది.

అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ iQOO Neo9 Pro 5G మొబైల్‌ను కేవలం రూ.34,999కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.35,149 వరకు బోనస్‌ కూడా పొందవచ్చు. దీంతో ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ పోను కేవలం రూ.1,850కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని తెలుసుకోవడానికి అధికారిక అమెజాన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.  

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఐకూ నియో 9 ప్రో టాప్‌ ఫీచర్స్‌:
డిస్‌ప్లే:

6.78 అంగుళాల E6 AMOLED డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
300Hz టచ్ శాంప్లింగ్ రేట్
HDR10+ సపోర్ట్
1200 nits పీక్ బ్రైట్‌నెస్

ప్రాసెసర్‌:
Qualcomm Snapdragon 8 Gen 2
4nm ప్రాసెస్ టెక్నాలజీ
7nm TSMC N4 ప్రాసెస్‌తో పోలిస్తే 35% ఎక్కువ పనితీరు
45% తక్కువ శక్తి వినియోగం

ర్యామ్‌ & స్టోరేజ్‌:
8GB/12GB LPDDR5x ర్యామ్‌
128GB/256GB/512GB UFS 3.1 స్టోరేజ్‌

కెమెరా:
50MP Sony IMX920 ప్రైమరీ కెమెరా
OIS సపోర్ట్
50MP 50mm పోర్ట్రెయిట్ లెన్స్
8MP అల్ట్రా-వైడ్ లెన్స్
16MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ & ఛార్జింగ్‌:
5160mAh బ్యాటరీ
120W ఫాస్ట్ ఛార్జింగ్‌
30 నిమిషాల్లో 100% ఛార్జ్

ఇతర ఫీచర్స్‌:
Android 14 ఆధారిత OriginOS 3
In-display ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్
IR బ్లాస్టర్
4G VoLTE, 5G SA/NSA
Wi-Fi 6E, Bluetooth 5.3
డ్యూయల్ నానో సిమ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News