iPhone 14 in Big Billion Day: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. ఐఫోన్ 14పై రూ.20 వేలకు పైగా భారీ డిస్కౌంట్

త్వరలోనే ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ ప్రారంభం కానుంది. అక్టోబరు 8న ప్రారంభంకానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఐ ఫోన్ 14 చాలా తక్కువ ధరకు రానుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 02:53 PM IST
iPhone 14 in Big Billion Day: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. ఐఫోన్ 14పై రూ.20 వేలకు పైగా భారీ డిస్కౌంట్

iPhone 14 in Big Billion Day: ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వేదికగా అతి త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కానుంది. అక్టోబరు 8న ప్రారంభం కానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ను వినియోగించే ప్లస్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే ఈ ఆఫర్స్ ను తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కు సంబంధించిన బ్లాక్ బాస్టర్ డీల్స్ కు సంబంధించిన కొన్ని విశేషాలు కలిగిన పోస్టర్లు సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుత సేల్ ద్వారా ఐఫోన్ గత మోడల్ అనగా ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ అమ్మకం జోరు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే ఐఫోన్ 15 మోడల్ విడుదలైన తరుణంలో గత మోడల్ మరింత డిస్కౌంట్ తో అమ్మకానికి ఉండనుంది. 

అక్టోబరు 8న ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో యాపిల్ స్మార్ట్ ఫోన్స్ పై రూ. 20 వేల కంటే మరింత తగ్గింపు లభించే అవకాశం ఉందట. ఈ డిస్కౌంట్ తో పాటు బ్యాంకు ఆఫర్స్ ద్వారా మరికొంత తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రూ. 50 నుంచి 60 వేల రూపాయల లోపు ధరకే ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు. 

ఐఫోన్ 14 బేస్ మోడల్..
ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర ప్రస్తుతం (APPLE iPhone 14, 128 GB, Blue) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,900కి విక్రయిస్తున్నారు. ఇప్పుడు దీనిపై 7 శాతం తగ్గింపు తర్వాత రూ. 64,999 ధరకే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ధరతో పోల్చుకుంటే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపుగా ఈ మొబైల్ రూ. 50 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఇవే కాకుండా వివిధ బ్యాంకుల తగ్గింపులతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత చౌకగా సొంతం చేసుకోవచ్చు. 

Also Read: Health Care: పాదాలు, అరికాళ్లు మండుతుంటే...రోజూ ఈ డ్రింక్ తాగితే చాలు

ఐఫోన్ 14 ప్లస్..
ఐఫోన్ 14లోని మరో మోడల్ ఐఫోన్ 14 ప్లస్ (APPLE iPhone 14 Plus Blue, 128 GB). ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం దీని ధర రూ. 73,999గా ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగే సమయంలో ఇది రూ. 60 వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చని అంచనా. వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుల ఆఫర్స్ తో పాటు మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీరు మరింత డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. 

అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ కు సంబంధించిన అన్ని ఆఫర్స్ ను ఫ్లిప్ కార్ట్ త్వరలోనే రివీల్ చేయనుంది. ఫ్లాష్ ధరను కూడా లాక్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు ఈ సంస్థ కల్పించింది. ఐఫోన్ 14 ఫ్లాష్ ధరను లాక్ చేసుకునేందుకు రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది. చివరిగా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News