Infinix Laptop Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఇన్‌ఫినిక్స్‌ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా 42 శాతం తగ్గింపు!

42 Percent offer on Infinix X1 Slim Series Core i3 10th Gen Laptop at Flipkart Big Saving Days. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్1 స్లిమ్ సిరీస్ (Infinix X1 Slim Series) ల్యాప్‌టాప్‌పై 42 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 20, 2022, 01:15 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో మెగా బంపర్ ఆఫర్
  • రూ.16,690లకే ఇన్‌ఫినిక్స్‌ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌
  • 42 శాతం తగ్గింపు ఆఫర్
Infinix Laptop Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఇన్‌ఫినిక్స్‌ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా 42 శాతం తగ్గింపు!

Infinix X1 Slim Series Core i3 10th Gen Laptop buy only Rs 16690 in Flipkart Big Saving Days: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ 'ఇన్ఫినిక్స్'.. భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందింది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చి పాపులర్ అయింది. ఇన్ఫినిక్స్ సంస్థ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌ విభాగంలోకి గతేడాదే అడుగుపెట్టింది. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్‌ ఎక్స్1 సిరీస్ పేరుతో ల్యాప్‌టాప్‌ను ముందుగా రిలీజ్ చేసింది. అనంతరం ఎక్స్ సిరీస్‌లో చాలా  ల్యాప్‌టాప్‌లే వచ్చాయి. ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్1 స్లిమ్ సిరీస్ (Infinix X1 Slim Series) ల్యాప్‌టాప్‌లు కూడా వచ్చాయి. ఈ ల్యాప్‌టాప్‌పై ప్రస్తుతం అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంది. 

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' 2022 కొనసాగుతోంది. క్రిస్టమస్ 2022 సందర్భంగా ఈ సెల్ డిసెంబర్ 16న ఆరంభం అయి 21తో ముగుస్తుంది. ఈ సెల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్1 స్లిమ్ సిరీస్ (Infinix X1 Slim Series) ల్యాప్‌టాప్‌పై 42 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. రూ. 49,999 ఈ ల్యాప్‌టాప్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 28,990లకే అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌పై రూ. 21,009 తగ్గింపు ఉంది. 

ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్1 స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌ (Infinix X1 Slim Series Core i3 10th Gen - 8 GB/256 GB SSD/Windows 11 Home XL21 Thin and Light Laptop )పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు మరియు క్రెడిట్ EMI Trxnsపై 10% తగ్గింపు ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ EMI Trxnsపై బ్యాంక్ ఆఫర్ 10% తగ్గింపు ఉంది. ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్1 స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ రూ. 12,300 ఉంది. పూర్తి ఆఫర్ వర్తిస్తే.. ఈ ల్యాప్‌టాప్‌ మీరు రూ.16,690లకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఈ ఆఫర్ మరొక్క రోజు మాత్రమే ఉంది. ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. 

Also Read: Beetroot Juice Benefits: కష్టమైనా బీట్‌రూట్ జ్యూస్ తాగండి.. రోజుల్లోనే ఈ 9 ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి!  

Also Read: Hero Vishal: సీఎం జగన్ అంటే ఇష్టం నా గుండెల్లో నుంచి వస్తుంది.. తమిళ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News