iPhone 13 Price Drop: ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. రూ.30 వేల లోపు ధరకే ప్రీమియం ఫోన్..

Iphone 13 Phone: ఐఫోన్ 14, ఐఫోన్ 15 ఫోన్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న ఐఫోన్ 13కి మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. తాజాగా ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది ఫ్లిఫ్ కార్ట్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 07:54 PM IST
iPhone 13 Price Drop: ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. రూ.30 వేల లోపు ధరకే ప్రీమియం ఫోన్..

Iphone 13 Huge Discount: రెండేళ్లు దాటిన ఐఫోన్ 13 కోసం కస్టమర్లు వెతకడం మానలేదు. ఐఫోన్ 15, ఐఫోన్ 14 మెుబైల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇంకా వినియోగదారులు ఐఫోన్ 13 కావాలనుకుంటున్నారు. దీంతో ఐఫోన్ 13పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ కలిగిన ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 52,999కి అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 12 ఫోన్ ను మాత్రం ఎక్సేంజ్ చేయాలనుకుంటే మీకు రూ. 31,953 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ రూ.28,097కి లభిస్తుంది. 

ఐఫోన్ 13 ఫీచర్స్
ఐఫోన్ 13లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీని మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్స్. మరో 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో A15 బయోనిక్ చిప్‌సెట్‌గా ఉపయోగించారు. ఇది చాలా పవర్ పుల్ ప్రొసెసర్. ఈ హ్యాండ్ సెట్ 5G కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ పై ఐదు నుంచి ఆరేళ్లపాటు అప్డేట్స్ ఇస్తుంది యాపిల్ సంస్థ. 

గోల్డెన్ కలర్ లో ఐఫోన్ 16 సిరీస్‌
గత సంవత్సరం ప్రారంభించిన ఐఫోన్ 15 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు తాజాగా టైటానియం రంగులో రిలీజ్ అయ్యాయి. ఈ మోడల్స్ డెసర్ట్ టైటానియం మరియు టైటానియం గ్రే రంగులలో అందుబాటులో ఉండనున్నాయి. లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రో మోడల్స్ గోల్డ్ కలర్ లో విడుదల చేయలేదు. త్వరలో లాంచ్ కాబోతున్న ఐఫోన్ 16 ప్రో ఫోన్ గోల్డ్ కలర్ లో రిలీజ్ కానుంది. 

Also Read: Flipkart iPhone 14 Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు, కేవలం 12,500

Also Read: T20I Cricket: టీ20ల్లో నమీబియా బ్యాటర్ సంచలనం.. కేవలం 33 బంతుల్లోనే సెంచ‌రీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News