Honor X7b 5G: రహస్యంగా లాంచ్ అయిన Honor X7b మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Honor X7b 5G: రహస్యంగా హానర్ (honor) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అద్భుతమైన 108MP కెమెరాతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 4, 2024, 02:52 PM IST
Honor X7b 5G: రహస్యంగా లాంచ్ అయిన Honor X7b మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Honor X7b 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్ (honor) రహస్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ Honor X7b 5G మోడల్‌లో లాంచ్‌ చేసింది. గతంలో కంపెనీ విడుదల చేసిన హానర్ X7b (4G) స్మార్ట్‌ఫోన్‌ని గ్లోబల్‌ వేరియంట్‌లో భాగంగా 5G వేరియంట్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 6000mAh బ్యాటరీతో లభిస్తోంది. అంతేకాకుండా ఇది ఇంతక ముందు లాంచ్‌ చేసిన వేరియంట్‌ కంటే అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ Honor X7b 5G స్మార్ట్‌ఫోన్‌ ఎన్నో రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. 
 
Honor X7b 5G ఫీచర్లు:
హానర్ X7b 5G డిస్‌ప్లే, 108MP కెమెరా:

ఈ హానర్ X7b 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13పై ఆధారపడి పని చేస్తుంది. దీంతో పాటు ఇది MagicOS 7.2పై రన్‌ అవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌  8 మెగాపిక్సెల్ కెమెరాతో లభిస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్‌లో డెప్త్, మాక్రో షాట్‌లు కూడా లభిస్తున్నాయ. దీంతో పాటు ఇది 8GB ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చింది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీలో భాగంగా మైక్రో SD కార్డ్ స్లాట్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB-C పోర్ట్‌ సపోర్ట్‌లతో లభిస్తోంది. అంతేకాకుండా USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ మొబైల్‌ మిడ్‌నైట్ బ్లాక్, క్రిస్టల్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో వచ్చింది. దీంతో పాటు 5330mAh బ్యాటరీతో సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు  166.7x76.5x8.24 mm  కొలతలను కలిగి ఉంటుంది. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిస్ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6- అంగుళాల FHD+ IPS LCD డిస్ప్లేను కలిగి ఉండవచ్చు.
కెమెరా : 64MP ప్రధాన సెన్సార్, వైడ్-యాంగిల్ లెన్స్, డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ రియల్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు.
బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 40W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
RAM, స్టోరేజ్ : 6GB, 8GB ర్యామ్‌, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
ఆపరేటింగ్ సిస్టమ్ : Android 13, Magic UI 7.0పై పని చేస్తుంది.
5G కనెక్టివిటీ : సబ్-6GHz 5Gలకు సపోర్ట్‌ చేస్తుంది.
ఇతర ఫీచర్లు : NFC, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్స్‌, ఇతర ఫీచర్స్‌ కూడా లభిస్తోంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News