Bumblebee Edition: కొత్త ఎడిషన్‌తో మార్కెట్‌లోకి గేమింగ్‌ ఫోన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్స్‌ పూర్తి వివరాలు!

Red Magic 9 Pro Plus Bumblebee Edition: ఇటీవలే అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్స్‌లో రెడ్ మ్యాజిక్ 9 ప్రో ప్లస్ ఒకటి. అయితే ఈ మొబైల్ మరోసారి కొత్త ఎడిషన్ తో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కొత్త ఎడిషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 30, 2024, 11:47 AM IST
Bumblebee Edition: కొత్త ఎడిషన్‌తో మార్కెట్‌లోకి గేమింగ్‌ ఫోన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్స్‌ పూర్తి వివరాలు!

Red Magic 9 Pro Plus Bumblebee Edition: ప్రస్తుతం మార్కెట్లో గేమింగ్ మొబైల్ ఫోన్లకి మామూలు డిమాండ్ లేదు.. చాలామంది యువత ఎక్కువగా ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ప్రీమియం ప్రాసెసర్‌తో వచ్చే స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా అధునాతన టెక్నాలజీతో కూడిన ప్రాసెసర్లతో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నాయి. గతంలో మార్కెట్లోకి విడుదలైన రెడ్ మ్యాజిక్ 9 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ కి ఎంత డిమాండ్ లభించిందో అందరికీ తెలిసిందే. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఎడిషన్ తో మార్కెట్లోకి ఇదే మొబైల్ ను మార్కెట్లోకి మళ్లీ విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెడ్ మ్యాజిక్ 9 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ బంబుల్బీ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ మొబైల్ గేమ్ కి ఎంతో ప్రసిద్ధి. అయితే ఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ అనేక రకాల అధునాతన ఫీచర్లతో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం చైనా తో పాటు ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు చైనా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇది ప్రస్తుతం  రెడ్ మ్యాజిక్ 9 ప్రో ప్లస్ బంబుల్‌బీ ఎడిషన్‌ని గిజ్‌టాప్‌లో $1199 ధరతో ఇస్తోందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రాసెసర్: 
ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ 3.2GHz క్లాక్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ గేమింగ్ చేసేవారికి, మల్టీ టాస్కింగ్ లో భాగంగా వివిధ యాప్స్ ను వినియోగించే వారికి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది.

డ్యూయల్ కెమెరాలు: 
కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను డ్యూయల్ కెమెరా సెట్ అప్‌తో అందుబాటులోకి తెచ్చింది. దీని బ్యాక్ సెట్‌లో 50MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు అద్భుతమైన ఫోటోలను అందించేందుకు హై రిజల్యూషన్ కలిగిన వీడియో రికార్డింగ్ కోసం ఈ కెమెరా చాలా బాగా పనిచేస్తుంది. దీంతోపాటు వివిధ రకాల కెమెరా ఫీచర్లను కూడా ఈ మొబైల్ కలిగి ఉంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అద్భుతమైన AMOLED డిస్‌ప్లే: 
ఈ Red Magic 9 Pro Plus స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగిన ఎంతో శక్తివంతమైన 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 960Hz టచ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని కారణంగా ఈ డిస్ప్లే గేమింగ్ కనుక్కునంగా స్పష్టమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంటుంది. దీంతోపాటు శక్తివంతమైన విజువల్స్ ను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

అధునాతన కూలింగ్ టెక్నాలజీ: 
ఈ Red Magic 9 Pro Plus స్మార్ట్ ఫోన్ ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఇది ICE 12.0 లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అలాగే అదనంగా అల్ట్రా-లైట్ నానో-సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ సెటప్ కూడా లభిస్తోంది. దీని కారణంగా ఎన్ని గంటల పాటు ఈ మొబైల్లో గేమింగ్ ఆడినప్పటికీ ఫోన్ పై ఎలాంటి ప్రభావం పడదు. అలాగే కూలింగ్ ప్రక్రియ ఉండడం వల్ల స్మార్ట్ ఫోన్ ద్వారా వచ్చే వేడి సులభంగా బయటికి వెళుతుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News