Airdopes 161 Price: ఇయర్‌బడ్స్‌కి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు కూడా తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఇయర్‌బడ్స్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే టెక్ కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకొని తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఇయర్‌బడ్స్‌ను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ టెక్ కంపెనీ బోట్ మరో ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఇది చూడడానికి ప్రీమియం లుక్‌లోనే ఉండటమే కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బోట్ తమ ఇయర్‌బడ్స్‌ను ఎయిర్‌డోప్స్ 161 (Airdopes 161)పేరుతో విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇయర్‌బడ్‌ల ఫీచర్ల వివరాల్లోకి వెళితే..ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేయడమే కాకుండా..50 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తోంది. దీంతో మీరు చార్జింగ్ లేకుండా రెండు రోజులకు పైగా వినియోగించవచ్చు. అంతేకాకుండా మరెన్నో కొత్త ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి ఈ ఇయర్‌బడ్స్..ఇక వీటి ధర విషయానికొస్తే..ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1500 కంటే తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి మొత్తం రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
ఇయిర్‌డోప్స్ 161 (Airdopes 161) ఫీచర్స్:
10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి 150 నిమిషాల పాటలు వినవచ్చు
50 గంటల బ్యాటరీ లైఫ్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్
4 మైక్ ENxTM టెక్నాలజీ
50 ఎంఎస్‌ల తక్కువ లేటెన్సీ మోడ్
క్రిస్టల్ క్లియర్ కాలింగ్ సపోర్ట్
డ్యూయల్ EQ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ మోడ్
సిగ్నేచర్ సౌండ్ సపోర్ట్
బ్యాలెన్స్‌డ్ మోడ్ ఫీచర్
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook