Big Saving Days Sale: భారీ డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌..Infinix Hot 30i స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 549లకే

Big Saving Days Sale Flipkart 2023: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్టలో Big Saving Days Sale ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటికే పలు కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌ విక్రయిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌కు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 14, 2023, 04:04 PM IST
Big Saving Days Sale: భారీ డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌..Infinix Hot 30i స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 549లకే

 

Big Saving Days Sale Flipkart 2023: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్టులో బిగ్ సేవింగ్‌ డేస్‌ సేల్‌ (Big Saving Days Sale) ప్రారంభం కాకముందే ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వస్తువులపై 20 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఇక స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇప్పుడే Infinix కంపెనీకి చెందిన HOT 30i సిరీస్‌ మొబైల్‌ను కొనుగోలుఎ చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ మొదట రూ. 11,999 ధరతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
    
కంపెనీ Infinix Hot 30i 5Gని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. దీని బేస్ మోడల్‌ 4GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌తో లభిస్తోంది. అయితే టాప్ మోడల్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు వేరియంట్లపై బ్యాంక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ఈ మొబైల్‌ ఫోన్ల ధర రూ. 8,999 ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను  HDFC క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా రూ. 3000 విలువైన ఉచిత కూపన్స్‌ కూడా పొందవచ్చు. ఇవే కాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో మీరు ఎక్చేంజ్‌ ఆఫర్‌ ద్వారా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.8,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో చివరికి ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 549లకే పొందవచ్చు. 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

ఫ్లిప్‌కార్టులో జూలై 14 మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ  Hot 30i 5Gని అరోరా బ్లూ, నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్లలో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 6020 ప్రాసెసర్‌పై పని చేయబోతోంది. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ ప్యాకప్‌ కలిగి ఉంటుంది. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లు మనం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో చూడవచ్చు.

Infinix Hot 30i ఫీచర్లు:
❃ 6.6 హెచ్‌ డీ డిస్‌ప్లే
❃ MediaTek Dimensity 6020 ప్రాసెసర్
❃ 50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
❃ 16GB ర్యామ్‌
❃ 120Hz రిఫ్రెష్ రేట్‌
❃ ఆండ్రాయిడ్ 13 
❃ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
❃ 2K వీడియో రికార్డింగ్‌ సపోర్ట్‌ 
❃ LED ఫ్లాష్
❃ MediaTek Dimensity 6020 చిప్‌సెట్ 
❃ స్టాండ్‌బై మోడ్‌లో 53 గంటల కాలింగ్ సపోర్ట్‌ 
❃ 18W టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
❃ పవర్ మారథాన్ టెక్నాలజీ
❃ Wi-Fi, బ్లూటూత్
❃ టైప్-C పోర్ట్
❃ 3.5mm ఆడియో జాక్‌లు
❃ స్ప్లాష్ రెసిస్టెన్స్ 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News