5G Phones under 10K: 5జి ఫోన్ కోసం చూస్తున్నారా, 10 వేలకే లబించే టాప్ 3 స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు ఇలా

5G Phones under 10K: ఇంటర్నెట్ అనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారిపోయింది. ఇందులో 5జి సేవలు అందుబాటులో వచ్చాక వేగం పెరిగింది. మరి ఇప్పటి వరకూ వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు కూడా మార్చుకోకతప్పదు. 5జి సేవలు పొందాలంటే 5జి స్మార్ట్‌ఫోన్లు అవసరమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2024, 06:52 AM IST
5G Phones under 10K: 5జి ఫోన్ కోసం చూస్తున్నారా, 10 వేలకే లబించే టాప్ 3 స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు ఇలా

5G Phones under 10K: 2జి నుంచి 3జి తరువాత 4 జి..ఇప్పుడు 5జి సేవలు అందుబాటులో వచ్చేశాయి. దీనికి తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్లు కూడా అప్‌గ్రేడ్ చేసుకోవల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జి డేటా సేవలు పొందాలంటే స్మార్ట్‌ఫోన్ కూడా 5జి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే 5జి స్మార్ట్‌ఫోన్లు ధర ఎక్కువని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా 10 వేల రూపాయల్లోపు లభించే 5జి స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.

5జి స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయిన కొత్తలో ధర చాలా ఎక్కువగా ఉండేది. 20 వేల బడ్జెట్ దాటితే గానీ లభించేది కాదు. కానీ ఇప్పుడు 5జి స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గిపోయాయి. చాలా అనువైన ధరకే లభ్యమౌతున్నాయి. అందరికీ అందుబాటులో రావడం వల్ల 5జి డేటా వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో 5జి స్మార్ట్‌పోన్ కొనాలని అనుకుంటుంటే..ఈ ఆప్షన్స్ మీ కోసమే..

మోటో జి34..అతి తక్కువ బడ్జెట్‌లో 10 వేలకు అటూ ఇటూ ధరలో లభ్యమయ్యే బెస్ట్ బ్రాండెడ్ 5జి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఇందులో బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిష్ కలిగి ఉంటుంది. 6.5 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరాతో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. 

లావా బ్లేజ్ 2...10 వేలలోపు లభించే బెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్ ఇది. 6.56 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 2.5డి కర్వ్డ్ స్క్రీన్ కావడంతో రిచ్ లుక్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ డి6020తో ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 18 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇక కెమేరా గురించి చెప్పుకోవల్సిన అసవరం లేదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ దర కేవలం 9,999 రూపాయలు మాత్రమే.

ఇక పోకోలో రెండు వేరియంట్లు ఉన్నాయి. Poco M6 5G బేసిక్ వేరియంట్ ఫోన్ ధర 10,499 రూపాయలకు లభిస్తుంది. 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటాయి. ఇందులో ఒక వేరియంట్ 9,999 రూపాయలకు కూడా లభిస్తుంది. ర్యామ్ జీబీని బట్టి ఫోన్ ధర మారుతుంది. 

Also read: Realme Narzo 70 Pro Launch: 50 మెగాపిక్సెల్ సోనీ కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ నేడే, ప్రీ సేల్ ఆఫర్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News