Police Raids: హయాత్ నగర్ లోని ఓ ఫాంహౌస్ లో రాత్రి జరిగిన పార్టీపై పోలీసులు దృష్టి సారించారు. అది రేవ్ పార్టీగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ పార్టీపై దాడి చేసిన పోలీసులు 33 మందిని అదుపులో తీసుకున్నారు.
Munugode Bypoll: ఉపఎన్నికల వేళ మునుగోడును భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. టోల్‌ప్లాజాలు, చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మోహరించిన కేంద్ర, రాష్ట్ర బలగాలు.. కీలకమైన పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రాజకీయంగా ఉపఎన్నిక కీలకంగా మారటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
జార్ఖండ్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్లు భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో కట్టల కొద్ది డబ్బును పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది.
CLUB MUSTI PUB: జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మైనర్ బాలికను పబ్ లోకి ఎలా అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. గ్యాంగ్ రేప్ ఘటనపై రచ్చ సాగుతుండగానే.. హైదరాబాద్ లో మరో పబ్ బాగోతం బయటపడింది. అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది సదరు పబ్. పబ్ పై పోలీసుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.