ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు.. ఏకే-47 రైఫిల్, బులెట్స్ లభ్యం

ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు.. ఏకే-47 రైఫిల్, బులెట్స్ లభ్యం

Last Updated : Aug 17, 2019, 10:40 AM IST
ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు.. ఏకే-47 రైఫిల్, బులెట్స్ లభ్యం

మొకామ: బీహార్‌లోని మొకామలో స్వతంత్ర ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఇంట్లో సోదాలు జరిపిన బీహార్ పోలీసులకు ఓ ఏకే-47 రైఫిల్, బులెట్స్ లభ్యమయ్యాయి. మొకామ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన అనంత్ కుమార్ సింగ్ పూర్వీకుల నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. గతంలో గ్యాంగ్‌స్టర్ అయిన అనంత్ కుమార్ సింగ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ పూర్వీకుల నివాసంలో భారీ ఎత్తున ఆయుధాలు నిల్వ చేశారని విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు.. శుక్రవారం భారీ సంఖ్యలో సాయుధ బలగాలతో అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు. 

ఎమ్మెల్యే నివాసంలో ఆయుధాలు లభించడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలను రప్పించి వారి సహాయంతో మరింత సోదాలు జరుపుతున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ కంతేష్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు, యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందాలు సైతం ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి.

Trending News