విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ ( Vijayawada Fire accident ) అగ్ని ప్రమాదం నేపధ్యంలో రమేష్ ఆసుపత్రి ( Ramesh hospital ) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఉన్న కేసులకు తోడు..విచారణకు హాజరుకపోవడం, నోటీసులకు స్పందించకుండా పరారీలో ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్యం ( Shripad Naik health condition ) మరింత క్షీణించడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి పలువురు వైద్య నిపుణుల బృందం హుటాహుటిన గోవా రాజధాని పనాజికి చేరుకుంది.
అగ్రరాజ్యం అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.
పది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( vijayawada swarna palace covid centre ) గురించి నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. విచారణ కమిటీ నివేదికలో అన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. బహుశా అందుకే డాక్టర్ రమేష్ పరారీ ( Dr Ramesh ) లో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
కరోనా వైరస్ చికిత్సలో ప్లాస్మా థెరపీ ( Plasma therapy ) ఇప్పుడు కీలకంగా మారింది. ఒక్కసారి వ్యాధిని జయించినవారి ప్లాస్మాతో మరి కొందరి ప్రాణాల్ని రక్షించవచ్చు. అందుకే ఇప్పుడు ప్లాస్మా దాతల అవసరముంది. దాతల్ని ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆ పోలీసులకు సెలెబ్రిటీలు సెల్యూట్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ( corona virus ) విజృంభిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో కోవిడ్ 19 ( Covid 19 ) మహమ్మారి తన పంజా విసురుతోంది. వ్యాక్సీన్ కు ఇంకా సమయం పట్టనుండటంతో అందరి దృష్టీ ప్లాస్మా థెరపీ( Plasma Therapy ) పై పడింది. దేశంలో తొలి ప్లాస్మా బ్యాంకును ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Delhi cm kejriwal ) ప్రారంభించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు ప్లాస్మా దానానికి అర్హులు ? అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా కట్టడికి ( corona ) దిల్లీ ప్రభుత్వం ( Delhi govt ) శాశ్వత చర్యలు చేపడుతోంది. కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలిస్తున్న ప్లాస్మా థెరపీను ( Plasma Therapy ) అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ( Delhi Cm kejriwal ) ప్రయత్నిస్తోంది.
కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్(Satyendar Jain) వేగంగా కోలుకుంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.