Vijayawada fire accident: డాక్టర్ రమేష్ పై మరిన్ని కేసులు?

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ ( Vijayawada Fire accident ) అగ్ని ప్రమాదం నేపధ్యంలో రమేష్ ఆసుపత్రి ( Ramesh hospital ) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఉన్న కేసులకు తోడు..విచారణకు హాజరుకపోవడం, నోటీసులకు స్పందించకుండా పరారీలో ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Last Updated : Aug 25, 2020, 02:42 PM IST
Vijayawada fire accident: డాక్టర్ రమేష్ పై మరిన్ని కేసులు?

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ ( Vijayawada Fire accident ) అగ్ని ప్రమాదం నేపధ్యంలో రమేష్ ఆసుపత్రి ( Ramesh hospital ) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఉన్న కేసులకు తోడు..విచారణకు హాజరుకపోవడం, నోటీసులకు స్పందించకుండా పరారీలో ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

విజయవాడలోని స్వర్ణప్యాలేస్ హోటల్ ( swarna palace ) లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నగరంలోని రమేష్ హాస్పటల్ ఈ హోటల్ లో అనధికారికంగా కోవిడ్ సెంటర్ నడపడం, నిబంధనలు పాటించకపోవడం , అనుమతి లేకుండా ప్లాస్మా థెరపీ ( plasma therapy ) చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి పలు కేసులు ఇప్పటికే రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై నమోదయ్యాయి. ముఖ్యంగా డాక్టర్ రమేష్ కు విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. అయితే డాక్టర్ రమేష్ నోటీసులకు స్పందించకుండా...విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అంశంలో మరిన్ని కేసులు నమోదు చేయడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కొడాలి నాని ( minister kodali nani ) పరోక్షంగా సంకేతాలిచ్చారు. డాక్టర్ రమేష్ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandra babu naidu ) ఇంట్లో దాక్కున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. నిజంగా తప్పు చేయకపోతే..దాచుకోవల్సిన అవసరం కానీ..దాచిపెట్టాల్సిన అగత్యం గానీ ఏముందని చంద్రబాబును ప్రశ్నించారు. అటు  హీరో రామ్ కూడా చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి నాని సూచించారు. డాక్టర్ రమేష్ ను రక్షించేందుకు డిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. 

Trending News