Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరవగా.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లారు.
AP Elections NDA Plan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికలపై ఎన్డీయే కూటమి సమావేశమైంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శక్రవారం జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు సమావేశం. గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.