AP Elections: ఎన్నికల్లో మనదే గెలుపు.. మూడు పార్టీల పూర్తి ధీమా

AP Elections NDA Plan: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీయే కూటమి సమావేశమైంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శక్రవారం జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు సమావేశం. గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

1 /7

AP Elections: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సమావేశమయ్యాయి.

2 /7

AP Elections: అమరావతి సమీపంలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరిగింది.  

3 /7

AP Elections: సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు.  

4 /7

AP Elections: ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు.

5 /7

AP Elections: గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని సమావేశంలో మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి.  

6 /7

AP Elections: పొత్తుపై అభ్యంతరాలు, అసంతృప్తులు ఉన్నా కూడా బీజేపీ, జనసేన, టీడీపీలు ముందడుగు వేస్తున్నాయి. అసంతృప్తులను బుజ్జగిస్తూ భవిష్యత్‌కు భరోసా ఇచ్చి ఎన్నికల యుద్ధం చేస్తున్నాయి.  

7 /7

AP Elections: ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత మరోసారి ఈ మూడు పార్టీలు సమావేశమై ప్రచారంపై చర్చించే అవకాశం ఉంది.