బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ సమర్థించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Rohit Reddy On Ed Enquiry: తనను అరెస్ట్ చేసినా బీజేపీకి లొంగనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టంచేశారు. ఫిర్యాదుదారుడిగా ఉన్న కేసులో తనపై విచారణ జరపడం విడ్డూరంగా ఉందన్నారు. ఈడీ విచారణపై ఆదివారం బీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం సీడీలను ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పూర్తి వివరాలు ఇలా..
Trs Mlas Poaching Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. అడ్వకేట్ శ్రీనివాస్‌కు మరోమారు నోటీసులు జారీ చేసింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. నందు, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని అధికారులు నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TRS MLAs Poaching Case Bail Plea: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయాలని చూసిన వ్యవహారంతో బీజేపీకి ఏ సంబంధం లేకపోతే ఈ కేసు విచారణ ఆపాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ బండారం బయటపడుతుందేమోననే భయంతోనే కోర్టుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.