Minister Malla Reddy: ఫుల్ బాటిల్ ను పట్టుకుని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి ఫుల్ బాటిల్ లిక్కర్ విజువల్ ను బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ గా వైరల్ చేస్తున్నారు.
Minister Malla Reddy Liquor Party: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి.. ఒక ఇంచార్జుగా తనకు అప్పగించిన గ్రామాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా తానే మందు పార్టీ ఇస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Casinos in Nepal: కేసినోస్ నిర్వాహకులతో మంత్రులకు సత్సంబంధాలు కలిగి ఉండటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించే వరకు అధికార పార్టీ ఏం చేస్తోందంటూ బీజేపి నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.
Minister Malla Reddy: ఈడీ సోదాల్లో నిందితుడు మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి మల్లారెడ్డి అండతోనే మాధవరెడ్డి చీకటి దందాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి
Protest Against GST: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో సామాన్య మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై సైతం జీఎస్టీ విధించడాన్ని మల్లారెడ్డి తప్పు పట్టారు. టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి మల్లారెడ్డి మేడ్చల్‌లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ATTAK ON MALLAREDDY: రెడ్డి సింహగర్జన సభకు వెళ్లిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడం.. దాడికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.మంత్రి మల్లారెడ్డిపై దాడి జరగడం రాజకీయంగా సంచలనంగా మారింది. మల్లారెడ్డిపై దాడి చేసిందెవరు.. ఎందుకు చేశారు.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక ఆవేశంతోనే అలా చేశారా అన్న చర్చలు సాగుతున్నాయి.
Minister Malla Reddy donates Rs 1.75 crores cash to Yadadri temple: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్లోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు (Minister Malla Reddy family), అనుచరులు, పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం యాదాద్రిని సందర్శించి ఈ విరాళం అందజేశారు.
Minister Malla Reddy comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి మల్లా రెడ్డి.. గతంలో తరహాలోనే మరోసారి రేవంత్‌పై నోరుపారేసుకున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మంత్రి మల్లా రెడ్డి (Minister Malla Reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి నిందితుడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పిన 24 గంటల్లో మృతదేహం లభ్యం అవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు అనేక మంది కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనావైరస్ బారినపడిన వారిలో పలువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో మంత్రి మల్లా రెడ్డి కూడా చేరారు.
Minister Malla Reddy vs Malipeddi Sudheer Reddy | మేడ్చల్: జిల్లాలో మంత్రి మల్లా రెడ్డి వర్గానికి, మలిపెద్ది సుధీర్ రెడ్డి వర్గానికి మధ్య ఉన్న విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మేడిపల్లి పోలిసు స్టేషన్ పరిదిలో ఈ ఇరువురు నేతల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్తా ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడే వరకు వెళ్లింది.
మంత్రి మల్లారెడ్డిపై మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని మల్లా రెడ్డిపై నాయిని నర్సింహా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.