Minister Malla Reddy: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల సోదాలు హైదరాబాద్ లో సంచలనంగా మారాయి. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సోదాలు జరిగాయి. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో అనేక అక్రమ లావాదేవీలు గుర్తించారు ఈడీ అధికారులు. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. తాము గుర్తించిన ఆధారాలతో పలు అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. ఈడీ సోదాల్లో నిందితుడు మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి మల్లారెడ్డి అండతోనే మాధవరెడ్డి చీకటి దందాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మల్లారెడ్డికి మాధవరెడ్డి బినామీ అని కొందరు ఆరోపిస్తున్నారు.
కాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు జరిపిన మాధవరెడ్డి కారుకు తన పేరున్న స్టిక్కర్ ఉండటంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. Mla స్టిక్కర్ తో తనకు ఎలాంటి సంభందం లేదన్నారు.మూడు నెలల క్రితం తాను స్టిక్కర్ పడేశానని చెప్పారు. తాను పడేసిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధం అన్నారు మంత్రి మల్లారెడ్డి. బుధవారం ఈ ఘటనపై స్పందించిన మల్లారెడ్డి తనకు కేటాయించిన స్టిక్కర్లన్ని తన దగ్గరే ఉన్నాయని తెలిపారు. మాధవరెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ ఫేక్ కావొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లోనే మాట మార్చిన మంత్రి మల్లారెడ్డి.. తాను మూడు నెలల క్రితం స్టిక్కర్ పడేశానని చెప్పడం వివాదాస్పదమవుతోంది. మాధవరెడ్డి విషయంలో మల్లారెడ్డి ఏదో దాచుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు సంంబంధించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. క్యాసినో చీకటి దందాను వీళ్లిద్దరు చాలా కాలం నుంచే సాగిస్తున్నారని తెలుస్తోంది. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లలో క్యాసినోలు నిర్వహించారని చెబుతున్నారు.గతంలో పేకాట ఆడించిన కేసుల్లో పోలీసులకు చిక్కాడు ప్రవీణ్. హైదరాబాద్ లోని కొన్ని క్లబ్‌లు వీళ్ల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రతి ఏటా తన బర్త్ డే రోజున ప్రవీణ్ తెగ హంగామా చేసేవారని తెలుస్తోంది. గత నెలలోనూ చీకోటి జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వేడుకకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్, ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారని తెలుస్తోంది. నగరాల నుంచి పలువురు ప్రముఖులు ఛార్టర్డ్ విమానాల్లో బర్త్ డే వేడుకలకు వచ్చారని చెబుతున్నారు.
Also Read: Big Relief To Telangana: బీజేపీతో కేసీఆర్ డీల్ కుదిరిందా? తెలంగాణకు రూ 10,200 కోట్ల రుణానికి ఓకే..
Also Read : Covid 19 Vaccination: షాకింగ్... ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook