Surya Grahanam, Chandra Grahanam: అక్టోబర్ 25 నాడు సూర్య గ్రహణం కానుండగా నవంబర్ 8 నాడు చంద్ర గ్రహణం కానుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం 12 గంటల పాటు దర్శనం మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది.
Chandra Grahan 2022: చంద్ర గ్రహణం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం ప్రతికూలమైనా లేదా సానుకూలమైనా. 16 మే 2022, సోమవారం నాడు వైశాఖ పూర్ణిమ నాడు జరగబోతున్న చంద్రగ్రహణం 5 రాశుల వారికి చాలా శుభప్రదం.
Blood Moon Lunar Eclipse 2022 date and time. 2022 ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక మే 16న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
Lunar eclipse : 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్ర గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.
ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 19 న కార్తీక పౌర్ణమి పండుగ రోజున రాబోతుంది. ఈ గ్రహణం కొన్ని రాశులపైన ఎక్కువ ప్రభావం చూపనుంది.. ఆ రాశులు ఏంటంటే.. ??
Lunar Eclipse 2021 Date And Timings: చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ స్థితిని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపిస్తే సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షికంగా కనిపిస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం 26 మే 2021న ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ చంద్ర గ్రహణాన్ని మనం వీక్షించలేము. సూర్యగ్రహణం సమయంలో ఉండే అంత ఆందోళన చంద్రగ్రహణం వేళ ఉండదని తెలిసిందే. వీక్షించడానికి ఎక్కువ అవకాశం ఉండే గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. కొన్ని రాశులవారికి చంద్రగ్రహణం సానుకూల ఫలితాలు అందించనుంది.
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం (lunar eclipse 2020) ఈ నెల 30న ఏర్పడనుంది. కార్తీక పౌర్ణమి నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడునుందని నిపుణులు తెలిపారు. అయితే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అంటారు.
Lunar Eclipse July 2020: చంద్రగ్రహణం ... ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు చంద్రగ్రహణం ఏర్పడింది. జనవరి 10న తొలిసారి చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్ 5-6 నాటి రాత్రిన రెండోసారి చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత జూన్ 21న సూర్య గ్రహణం ఏర్పడిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత అతి స్వల్ప వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జూలై 5న ఆకాశంలో చంద్ర గ్రహణం కనువిందు చేయనుంది.
ప్రపంచ వ్యాప్తంగా 2020లో ఇప్పటి వరకు రెండు చంద్రగ్రహణాలను ( Lunar Eclipse ) ప్రజలు వీక్షించారు. ఇటీవలే సూర్యగ్రహణం ( Solar Eclipse ) కూడా ఏర్పడింది. అయితే త్వరలో మరో చంద్రగ్రహణం ఏర్పడనుంది.
Lunar eclipse june 2020: చంద్ర గ్రహణం రాశులపై ప్రభావం చూపిస్తుందా ? చంద్ర గ్రహణం వల్ల జాతకాల్లో ప్రభావం కనిపిస్తుందా ? చంద్ర గ్రహణం ప్రభావంతో రాశీ ఫలాలు ( Rashifal) మారుతాయా ? గ్రహణాలు మనిషిపై, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్మేవారిలో చాలామందికి కలిగే సందేహాలివి.
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం రానే వచ్చింది. జూన్ 5న రాత్రి ప్రారంభమయ్యే చంద్రగ్రహణం మూడు గంటలకు పైగా కనువిందు చేయనుంది. పలు దేశాల్లో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న తిరుమల శ్రీవారి ఆలయాన్ని, శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.