Lunar Eclipse Time: నేటి రాత్రి చంద్రగ్రహణం.. మూడు గంటలకు పైగా అకాశంలో అద్భుతం

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం రానే వచ్చింది. జూన్ 5న రాత్రి ప్రారంభమయ్యే చంద్రగ్రహణం మూడు గంటలకు పైగా కనువిందు చేయనుంది. పలు దేశాల్లో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.

Last Updated : Jun 5, 2020, 01:01 PM IST
Lunar Eclipse Time: నేటి రాత్రి చంద్రగ్రహణం.. మూడు గంటలకు పైగా అకాశంలో అద్భుతం

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం (Lunar Eclipse 2020) వచ్చేసింది. నేటి (జూన్ 5న) రాత్రి 11 గంటల 15 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి 2 గంటల 34 నిమిషాలకు గ్రహణం వీడనుంది. దాదాపు 3 గంటల 19 నిమిషాలపాటు గ్రహణం ఏర్పడుతుంది. అర్ధరాత్రి 12:55 నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో ఉంటుందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.  ఏనుగు మృతి కేసులో పురోగతి.. ఓ నిందితుడి అరెస్ట్

చంద్రుడికి, సూర్యుడికి మధ్యగా భూమి వస్తుంది. అంటే సూర్యుడి కాంతి, వెలుతురు చంద్రుడిపై పడకుండా ఇలా భూమి అడ్డుగా రావడాన్నే చంద్రగ్రహణం (Lunar Eclipse) అంటారు. పౌర్ణమి రోజు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఐరోపా (యూరప్)లోనని పలు దేశాలు, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహా సముద్రం ప్రాంతాల వారు చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.  నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు: హరీష్ రావు

చంద్రగ్రహణాలు మొత్తం మూడు రకాలుగా ఏర్పడతాయి. పాక్షిక, సంపూర్ణ, సాధారణ చంద్రగ్రహణం అని మూడు రకాలుగా ఏర్పడతాయి. ప్రస్తుత చంద్రగ్రహణం టెలిస్కోప్ అవసరం లేకుండానే మామూలుగానే వీక్షించవచ్చు. ఎందుకైనా మంచి బైనాకులర్స్, టెలీస్కోప్ సాయంతో చంద్రగ్రహణాన్ని వీక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జనవరి 10న ఏర్పడ్డ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం కాగా, కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే చంద్రుడు కనువిందు చేశాడు. కష్టతరంగా టెలీస్కోప్ సాయంతో ఆ చంద్రగ్రహణాన్ని ప్రజలు వీక్షించడం తెలిసిందే. లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’‌ని చూశారా!

కాగా, ఈ ఏడాది జులైలో ఒకటి, నవంబర్ నెలలో మరో చంద్రగ్రహణం సంభవించనున్నాయి. మొత్తంగా 2020లో నాలుగు చంద్రగ్రహణాలు ఏర్పడుతాయి.ఈ ఏడాది 2 సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయని ఖగోళ నిపుణులు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
  
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి

Trending News