Boycott Netflix: బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ వివాదం.. శివాలయంలో బూతు సన్నివేశాలు

గత రెండు రోజులుగా బాయ్‌కాట్ నెట్ ఫ్లిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లో లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా పలు బూతు సన్నివేశాలు, కథనాలు ఉన్నాయని ఆరోపణలు రావడమే.

Last Updated : Nov 24, 2020, 06:42 AM IST
Boycott Netflix: బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ వివాదం.. శివాలయంలో బూతు సన్నివేశాలు

గత రెండు రోజులుగా బాయ్‌కాట్ నెట్ ఫ్లిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లో లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా పలు బూతు సన్నివేశాలు, కథనాలు ఉన్నాయని ఆరోపణలు రావడమే. ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ కథాంశంలో భాగంగా 19 ఏళ్ల లిటరేచర్ స్టూడెంట్ తనను ఫాలో అవుతున్న ముగ్గురు అబ్బాయిలతో రొమాన్స్ చేయడం, అందులోనూ తన ముస్లిం బాయ్ ఫ్రెండ్‌తో శివాలయంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ఉన్న శివాలయంలో ఈ లవ్ మేకింగ్ సీన్స్ ( Kissing scenes in Lord Maheshwar temple controversy ) తెరకెక్కించారని.. లవ్ జిహాద్‌ని ప్రోత్సహించడం ఒక తప్పయితే, ఆ సన్నివేశాలను హిందూ దేవాలయంలో తెరకెక్కించడం మరో పాపం అని పేర్కొంటూ బీజేపీ నేత గౌరవ్ తివారి మధ్యప్రదేశ్‌లోని రెవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also read : Mandana Karimi: హీరోయిన్ దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వెళ్లిన నిర్మాత !

ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ మేకర్స్‌పై చర్యలు తీసుకుని లవ్ జిహాద్‌కి ( Love jihad row ) చెక్ పెట్టాలని గౌరవ్ తివారి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటికే ఈ కేసులో నెట్‌ఫ్లిక్స్ కాంటెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ పబ్లిక్ పాలసీలు విభాగం డైరెక్టర్ అంబికా ఖురానాలపై రెవా పోలీసులు కేసు చేశారు. ఈ కారణంగానే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ హ్యాష్‌ట్యాగ్ ( #boycottnetflix ) వైరల్ అవుతోంది.

Also read : Chatrapathi Hindi remake: ఛత్రపతి హిందీ రీమేక్‌కి డైరెక్టర్ అతడేనా ?

Also read : Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌కి చిరంజీవి షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News