Strict Law in MP religion converted by getting married: భోపాల్: లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది. ప్రేమ పేరుతో వివాహం చేసుకోని వారి మతాన్ని (religion converted) మార్చడానికి కుట్ర పన్నే వారిపై చర్యలకు కొత్త చట్టం తీసుకువస్తామని, అలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తె లేదని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( CM Shivraj Singh Chouhan) పేర్కొన్నారు.
We're bringing a strict law in Madhya Pradesh against those who conspire to get others' religion converted by getting married in name of love. We won't tolerate this. We've started the procedure & soon, this law will come into force: Madhya Pradesh CM Shivraj Singh Chouhan https://t.co/EYs9daTGo4 pic.twitter.com/MKkvCvFN4I
— ANI (@ANI) November 4, 2020
ప్రేమ పేరుతో వివాహం చేసుకుని ఇతరుల మతాన్ని మార్చడానికి కుట్ర పన్నేవారికి వ్యతిరేకంగా మేం మధ్యప్రదేశ్‌లో కఠినమైన చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఇలాంటి వాటిని తాము సహించమని చౌహాన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి వస్తుందని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ బుధవారం తెలిపారు. Also read: Yogi Adityanath: లవ్ జిహాద్‌ను సహించం.. వినకపోతే అంతిమయాత్రే
ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచార సభలో లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం యోగి పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. Also read: TRP scam: టెలివిజన్ రేటింగ్స్‌పై కమిటీ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe