TTDP chief Bakkani Narsimhulu: హైదరాబాద్: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బక్కని నర్సింహులు టిటిడి బోర్డు సభ్యుడిగానూ సేవలు అందించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ (L Ramana) ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
Bakkini Narasimhulu as TTDP chief ?: హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి ఎల్ రమణ గుడ్ బై చెప్పిన అనంతరం టీటీడీపీ చీఫ్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కిని నరసింహులుని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు సమాచారం.
L Ramana Resigns to TDP: తెలంగాణ సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించిన మరుసటిరోజే టీడీపీకి ఎల్ రమణ షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేశారు. ఇకనుంచి తన పయనం టీఆర్ఎస్తోనేనని రమణ స్పష్టం చేశారు.
L Ramana to join TRS soon: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని టీటీడీపీ చీఫ్ ఎల్ రమణ స్పష్టంచేశారు. సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ తెలిపారు. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఎల్ రమణ (L Ramana meets CM KCR).. అనంతరం ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు.
TTDP chief L Ramana party change news:హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి మంతనాలు జరపగా.. వారికి రమణ సానుకూలంగా స్పందించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ వీడటంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ఎల్ రమణతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపించింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన టీడీపీ.. తాజాగా తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు ముందుగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బలమైన నాయకులను కలిగి ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీల్లో చేరడంతో బలహీనపడిందనే విషయం ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో రుజువవుతూ వచ్చింది.
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ (L Ramana) డిమాండ్ చేశారు. తెలంగాణలోని కరోనా బాధితులకు న్యాయం జరిగేవరకు అఖిలపక్షం పోరాటం కొనసాగిస్తుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.