L Ramana Resigns to TDP: తెలంగాణలో టీడీపీకి భారీ షాక్, అధ్యక్ష పదవికి రమణ రాజీనామా

L Ramana Resigns to TDP: తెలంగాణ సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించిన మరుసటిరోజే టీడీపీకి ఎల్ రమణ షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేశారు. ఇకనుంచి తన పయనం టీఆర్ఎస్‌తోనేనని రమణ స్పష్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2021, 03:28 PM IST
  • తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన మరుసటిరోజే కీలక నిర్ణయం
  • తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ
  • త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరతానని స్పష్టం
L Ramana Resigns to TDP: తెలంగాణలో టీడీపీకి భారీ షాక్, అధ్యక్ష పదవికి రమణ రాజీనామా

TTDP Chief L Ramana Resigns to TDP: హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించిన మరుసటిరోజే టీడీపీకి ఎల్ రమణ షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారని సమాచారం.

ఇకనుంచి తన పయనం టీఆర్ఎస్‌తోనేనని రమణ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే టీడీపీని వీడి (L Ramana to join TRS), టీఎర్ఎస్‌లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా రాజకీయంగా తన ఎదుకుదలకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత కొంతకాలం నుంచి రమణ టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చొరవతో గురువారం నాడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో రమణ భేటీ అయ్యారు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ రావడం, పార్టీలో తగిన గుర్తింపు హోదా ఇస్తామని చెప్పడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read: L Ramana to join TRS: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు: ఎల్ రమణ

మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సమక్షంలో రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, బీసీల ప్రగతికి సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గురువారం నాడు చర్చించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రమణ రాజీనామా చేశారు. త్వరలోనే కారెక్కనున్నానని స్పష్టం చేశారు.

Also Read: YSR Telangana Party: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, జండా ఆవిష్కరించిన షర్మిల 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News