Holiday for schools, colleges and offices in Telangana: హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (PE CET) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు పీఈ సెట్ కన్వీనర్ స్పష్టంచేశారు.
Srisailam dam gates opened: కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు కర్ణాటకలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదం పెరిగి పెద్దదవుతోంది. అక్రమ ప్రాజెక్టులపై ఒకరికొకరు ఆరోపణలు సంధించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకు కూడా చేరింది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు.
MLA Roja warns Telangana govt and ministers over KRMB issues: అమరావతి: తెలంగాణ సర్కారు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తిచేశారు. క్రిష్ణా రివర్ (Krishna river water row) నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు మళ్లీ ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేసిన రోజా.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు.
Water sharing row: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది.
Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది.
తెలంగాణ సర్కారుకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( GRMB ), క్రిష్ణా రివర్ బోర్డులు ( KRMB ) షాక్ ఇచ్చాయి. గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని.. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతోపాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనిదే కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ సర్కార్‌కి ( Telangana govt ) ఓ లేఖ రాసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.