హైదరాబాద్: తెలంగాణ సర్కారుకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( GRMB ), క్రిష్ణా రివర్ బోర్డులు ( KRMB ) షాక్ ఇచ్చాయి. గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని.. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతోపాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనిదే కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ సర్కార్‌కి ( Telangana govt ) ఓ లేఖ రాసింది. ఏపీ సర్కార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఈ లేఖ రాస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖలో గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డు స్పష్టంచేసింది. ఇదిలావుంటే, మరోవైపు కృష్ణా రివర్ బోర్డు నుంచి సైతం ఇటువంటి ఆదేశాలే జారీ అయినట్టు తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ( Kaleshwaram project ) అనుబంధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణాలకు తాత్కాలిక బ్రేకులు పడనున్నాయా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ( Read also : రేపటి నుంచి 200 రైల్వే సర్వీసులు )
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, వాటికి అవసరమైన నీటి మళ్లింపుల విషయంలో తీసుకుంటున్న పలు నిర్ణయాల కారణంగా ఏపీకి ఇబ్బందులు తప్పేలా లేవని ఏపీ ప్రభుత్వం ( AP govt ) ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ గోదావరి రివర్ బోర్డుకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..