AP vs Telangana: ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2021, 07:44 AM IST
AP vs Telangana: ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ వైఖరిలో ఈసమెత్తు తప్పులేదన్న జగదీష్ రెడ్డి.. తప్పు చేసిన వాళ్లే ఇప్పుడు లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారని అన్నారు. నీటి పంపకాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడంపై స్పందిస్తూ మంత్రి జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలుచేశారు. 

సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణా నీళ్లు దోచుకున్నారని, ఇప్పుడు తండ్రిని మించిన దుర్మార్గుడిలా జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సమస్యను సృష్టించిందే ఆంధ్రా సర్కార్‌ (AP government)‌ అని వ్యాఖ్యానించిన మంత్రి.. మళ్లీ తెలంగాణపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తోంది కూడా ఆంధ్రా సర్కారేనని అన్నారు. 

Also read : MLA Roja on KRMB row: తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రులకు ఎమ్మెల్యే రోజా హెచ్చరిక

హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా అని ప్రశ్నించిన మంత్రి జగదీష్ రెడ్డి.. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవో అయినా ఇచ్చారా అని ఏపీ సర్కారును నిలదీశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి ఉమ్మడి పాలకులు 50 ఏండ్లు ద్రోహం చేశారు. గతంలో వరుసగా ఏడేళ్లపాటు కరువు వచ్చిన సమయంలోనూ కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలారని ఆనాటి పరిస్థితులను మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి పాలనలో ఉండగా ఆంధ్రా పాలకులు హుకుంలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు (Srisailam gates, Nagarjuna sagar gates) ఎత్తి నీటిని వాడుకున్నారని.. కానీ ఇకపై కూడా అప్పట్లాగే ఆడుకుంటాం, వాడుకుంటాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా (CM KCR) ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తంచేసిన మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam dam) నిర్మించిందే జల విద్యుత్ ఉత్పత్తి కోసమని, అందుకే చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడాన్ని ఏపీ సర్కారు తప్పుబట్టడం ఏంటని మంత్రి జగదీశ్ రెడ్డి ఏపీ సర్కారు వైఖరిపై, సీఎం జగన్‌పై మండిపడ్డారు.

Also read: Ysr Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకం కొత్త మార్గదర్శకాలివే..ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News