Pawan Kalyan On Amalapuram: అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంస ఘటనలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు పవన్ కళ్యాణ్. జిల్లా ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
Amalapuram Violence: అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్న అధికార వైసీపీ నేతల ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నాకు. అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ సహాయ, సహాకారాలతో పథకం ప్రకారం జరిగిందేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు
Amalapuram Update: అమలాపురంలో జరిగిన విధ్వంసం, కోనసీమ జిల్లా వివాదం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. పోలీసుల యాక్షన్ తో అల్లర్లు తగ్గినా.. రాజకీయ యుద్ధం మాత్రం మరింత ముదురుతోంది. మంగళవారం జరిగిన ఘటనలకు సంబంధించి గంటకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అదే సమయంలో పార్టీల నేతల సంచలన ఆరోపణలు చేస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు.
Konaseema Protest: మంగళవారం అల్లర్లు, విధ్వంసకాండతో అట్టుడికిన అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను భారీగా మోహరించడంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్ విద్యార్థులు, అత్యవసర పనులు ఉన్నవాళ్లు మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు. 5 వందల మందికి పైగా పోలీసులు అమలాపురంలో పహారా కాస్తున్నారు.
Konaseema Protest: గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పైర్లు గుర్తుకువస్తాయి.. ప్రశాంత వాతావరణం కళ్లముందు కదలాడుతుంది.గోదావరి జిల్లాల ప్రజలకు వెటకారమే తప్ప కోపమే ఉండదంటారు.అలాంటి గోదావరి జిల్లాల్లో తుని ఘటన ఓ మచ్చలా మిగిలింది. 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తుని తగలబడింది. అరేళ్ల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే జరిగింది. ఈ సారి ఆకుపచ్చని కోనసీమ మంటల్లో చిక్కుకుంది.అమలాపురం అగ్ని గుండమైంది.
Konaseema curfew: పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ అగ్నిగుండమైంది.అదనపు బలగాలను మోహరించిన పోలీసులు... అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు.రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి శాంతించినట్లు కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కోనసీమ వాసుల్లో కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.