Amalapuram Update: పీకే డైరెక్షన్ లోనే కోనసీమలో అల్లర్లు.. జనసేన నేతలు సంచలన కామెంట్లు..

Amalapuram Update: అమలాపురంలో జరిగిన విధ్వంసం, కోనసీమ జిల్లా వివాదం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. పోలీసుల యాక్షన్ తో అల్లర్లు తగ్గినా.. రాజకీయ యుద్ధం మాత్రం మరింత ముదురుతోంది. మంగళవారం జరిగిన ఘటనలకు సంబంధించి గంటకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అదే సమయంలో పార్టీల నేతల సంచలన ఆరోపణలు చేస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 02:59 PM IST
  • అమలాపురం అల్లర్లపై రాజకీయ రచ్చ
  • పీకే డైరెక్షన్ లోనే కోనసీమలో అల్లర్లు!
  • జనసేన నేతలు సంచలన కామెంట్లు
Amalapuram Update: పీకే డైరెక్షన్ లోనే కోనసీమలో అల్లర్లు.. జనసేన నేతలు సంచలన కామెంట్లు..

Amalapuram Update: అమలాపురంలో జరిగిన విధ్వంసం, కోనసీమ జిల్లా వివాదం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. పోలీసుల యాక్షన్ తో అల్లర్లు తగ్గినా.. రాజకీయ యుద్ధం మాత్రం మరింత ముదురుతోంది. మంగళవారం జరిగిన ఘటనలకు సంబంధించి గంటకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అదే సమయంలో పార్టీల నేతల సంచలన ఆరోపణలు చేస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు. అమలాపురం అల్లర్ల వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తం ఉందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తుండగా.. జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన కేసును పక్కదారి పట్టించేందుకే అధికార పార్టీ అల్లర్లు స్పష్టించిందని జనసేన నేత కందుల దుర్గేష్ ఆరోపించారు. వైసీపీ పాలనలో ఎప్పుడు జరగని విధ్వంసాలు జరుగుతున్నాయని అన్నారు.

దళిత డ్రైవర్ హత్య ఘటనను మరవకముందే అమలాపురంలో విధ్వంసం జరిగిందన్నారు దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదన్న దుర్గేష్.. కోనసీమ అల్లర్లపై, అనంతబాబు డ్రైవర్ హత్య పైన సిబిఐ  విచారణ జరపాలని జనసేన నేత డిమాండ్ చేశారు. తమ పార్టీ MLC అనంతబాబు దళిత యువకుడిని హత్య చేస్తే ఇప్పటి వరకు స్పందించని హోంమంత్రి వనిత... అమలాపురం అల్లర్లు జరిగిన వెంటనే సీన్ లోకి వచ్చారని కందుల దుర్గేష్ అన్నారు. విచారణ చేయకుండానే  అల్లర్లలో జనసేన  ప్రమేయం ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నిఘా విభాగం ఏమైంది.. మంత్రి ఇంటికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారని ఆయన నిలదీశారు. అమలాపురంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేయడం మానేసి .. ప్రతిపక్ష పార్టీలపై బురదజల్లే పనిలో  హోంమంత్రి ఉన్నారని విమర్శించారు.

ఉదయం 500 మంది ఉన్న ఆందోళనకారులు మధ్యాహ్నం ఎందుకు పెరిగారో, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని అమలాపురం జనసేన ఇంచార్జ్ రాజబాబు అన్నారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందన్నారు. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపించారు. కోనసీమ పరిరక్షణ సమితిలో ఉన్నవారంతా వైసిపి నాయకులేనని చెప్పారు రాజబాబు. అమలాపురం సంఘటనను జనసేన మీద రుద్దే  కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని అమలాపురం ఆందోళనలో పాల్గొనలేదనిచెప్పారు. తమ నేత ఆదేశాల మేరకు జనసైనికులు సంయమనం పాటించి అల్లర్లకు దూరంగా ఉన్నారని రాజబాబు తెలిపారు. ఇళ్ళపైకి వెళ్ళి తగలబెట్టడం చాలా హేయమైన చర్య అని ముమ్మిడివరం ఇంచార్జీ పితాని బాలకృష్ణ అన్నారు. పికే ప్లాన్ లో భాగంగానే ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. రాజకీయాల కోసం అంబేద్కర్ పేరును రాజకీయం చేయడం దారుణమన్నారు.

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అమలాపురం అల్లర్లను సృష్టించారని పంతం నానాజీ ఆరోపించారు. డ్రైవర్ హత్యలో అనంతబాబుతో పాటు ఇంకెవరు ఉన్నారో బయటపెట్టాలని అన్నారు. అమలాపురం అల్లర్లకు జనసేనకు సంబంధం ఉన్నట్లు హోం మంత్రి మాట్లడిన మాటలను వెనక్కి తీసుకోవాలని నానాజి డిమాండ్ చేశారు.

READ ALSO: Konaseema Protest: అప్పుడు తుని.. ఇప్పుడు అమలాపురం! మంటలతో భీతిల్లిన గోదావరి జనం..

READ ALSO: Amalapuram Issue: అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు! విద్రోహ శక్తులను ఏరివేస్తామన్న డీజీపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News