Pawan Kalyan On Amalapuram: ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేయడానికే అల్లర్లు.. కోనసీమలో జగన్ చిచ్చుపెట్టారన్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan On Amalapuram: అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంస ఘటనలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు పవన్ కళ్యాణ్. జిల్లా ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 02:58 PM IST
  • కోనసీమలో చిచ్చు పెట్టిందే వైసీపీ- పవన్
  • అల్లర్లు కోరుకున్నట్లుగా వైసీపీ ఉద్దేశం- పవన్
  • కుట్ర పూరితంగానే పేరు విషయంలో జాప్యం
Pawan Kalyan On Amalapuram: ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేయడానికే అల్లర్లు.. కోనసీమలో జగన్ చిచ్చుపెట్టారన్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan On Amalapuram: అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంస ఘటనలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు పవన్ కళ్యాణ్. జిల్లా ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో  ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటనీ పవన్ ప్రశ్నించారు. అన్ని జిల్లాలకు ఒక రూల్.. కోనసీమ జిల్లాకు మరో రూల్ ఎందుకు అని నిలదీశారు. అల్లర్లకు జనసేనను భాద్యుడి చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. అమలాపురం ప్రజలు సంయమనం పాటించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

మిగితా జిల్లాల విషయంలో  కాకుండా కోనసీమ జిల్లా విషయంలో  అభ్యంతరాలకు గడువు ఇవ్వడమే కుట్రపూరితం అన్నారు పవన్. భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే 30 రోజుల గడువు ఇచ్చారన్నారు. కోనసీన ప్రజల భావోద్వేగాలు తెలిసి కూడా ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. జిల్లా పేరుపై అభ్యంతరాలు వ్యక్తులు మాత్రమే ఇవ్వాలనే షరతు కోనసీమ ఒక్క జిల్లా విషయంలోనే  ఎందుకు పెట్టారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. వైసీపీ ఉద్దేశం అల్లర్లు కోరుకున్నట్లుగా ఉందన్నారు. గొడవలు జరిగే వాతావరణం ప్రభుత్వంపై స్పష్టించిందని ఆరోపించారు. పోలీసులను అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికే అన్నారు పవన్ కళ్యాణ్. నిరసనకారులను అడ్డుకునే అవకాశం ఉన్నా చేయలేదన్నారు .మంత్రి ఇంటిమీద దాడి జరిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని పవన్ విమర్శించారు.  

జిల్లాకు పేరును వ్యతిరేకించడం అంటే ఆ వ్యక్తిని వ్యతిరేకించినట్లు  కాదన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం తెచ్చిన పొట్టి శ్రీరాములు పేరు ఒక జిల్లాకు పెడితే ఆయన గౌరవం తగ్గించినట్లేనని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు కర్నూల్ జిల్లాకు ఎందుకు పెట్టలేదని పవన్ ప్రశ్నించారు. కడప జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టుకుంటే సరిపోయేది కదా అన్నారు. కులాల మీద వైసీపీ ఆట ఆడుతోందని పవన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేయడానికే అమలాపురం అల్లర్లు జరిగాయన్నారు. కుల సమీకరణల  మీదే రాష్ట్రంలో రాజకీయాలు సాగుతున్నాయన్నారు. తాను అన్ని కులాలు కలిసి ఉండాలని కోరుకునేవాడినని చెప్పారు పవన్ కళ్యాణ్. కోడికత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసు ఇంకా ఎందులు తేలడం లేదని పవన్ అన్నారు.

READ ALSO: Amalapuram Update: పీకే డైరెక్షన్ లోనే కోనసీమలో అల్లర్లు.. జనసేన నేతలు సంచలన కామెంట్లు..

READ ALSO: Kapil Sibal: కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్..పార్టీకి సీనియర్ నేత గుడ్‌బై..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News