Karnataka Next CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? సంపూర్ణ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందా..? మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కల నెరవేరుతుందా..? జేడీఎస్ మరోసారి కీరోల్ ప్లే చేస్తుందా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయాల్లో భారీగా చర్చ జరుగుతోంది.
Karnataka Assembly Elections Candidates List: కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కొంతమంది తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరి కొంతమంది ఇప్పటికే రాజకీయాల్లో ఆరితేరారు.
Amit Shah on Karnataka Assembly Elections: కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. వారి స్థానంలో వేరొకరిని బరిలోకి దింపింది. దీంతో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Karnataka BJP Ministers Wealth: కర్ణాటక ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. అధికార పార్టీ మంత్రుల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడైంది. ఎవరి ఆస్తి ఎంత పెరిగిందంటే..
Vote From Home In Karnataka Elections: పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయనుంది.
Ayanur Manjunath Quits From BJP: కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు అధికార బీజేపీకి రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నారో ఇంకా ప్రకటించలేదు.
Minister Nagaraju Assets: కర్ణాటక మంత్రి ఎమ్‌టీబీ నాగరాజు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.1,609 కోట్లుగా ప్రకటించారు. గత ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.500 కోట్లు పెరిగాయి.
Jagadish Shettar Joins In Congress: మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు అధికార పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
Kiccha Sudeep Comments: ఈగ సినిమా పేరు చెప్పగానే రాజమౌళితో పాటు గుర్తొచ్చేది ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో చేరి మద్దతు ప్రకటించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Threatening Letters to Kannada Star Hero: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది, ఆయన ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరింపు లేఖల్లో పేర్కొన్నారు.
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించనుండటంతో పాటు తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం ఏర్పాటు కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.