Amit Shah on Karnataka Assembly Elections: కర్ణాటక ఎన్నికలు ఫుల్ హీటెక్కాయి. అభ్యర్థులు ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తుండడంతో ఎవరికీ ఓటు వేయాలి..? ఎవరిని గెలిపించాలో ప్రజలు లెక్కలు వేసుంటుకున్నారు. మరోసారి అధికారం ఛేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తుండగా.. సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక తమ పార్టీలో టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీల్లో జంప్ అయి టికెట్ దక్కించుకుని పోటీ చేస్తున్నారు.
ముఖ్యంగా అధికార బీజేపీలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది వంటి సీనియర్ నాయకులు కూడా టికెట్ దక్కని నేతల జాబితాలో ఉన్నారు. దీంతో వీరిద్దరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వకపోవడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
బీజేపీ ఎల్లప్పుడు మార్పును కోరుకుంటుందని.. కొత్తవారిని ప్రోత్సహిస్తుందని అన్నారు. బీజేపీ నుంచి టికెట్ దక్కని మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ సాయంతో ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుంటే.. ఒంటరిగా గెలవలేమని అంగీకరించినట్లేనని అన్నారు. కాంగ్రెస్‌లో చేరింది శెట్టర్ మాత్రమేనని.. తమ ఓటు బ్యాంక్, తమ పార్టీ నేతలు అలాగే ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ చెక్కుచెదరలేదని.. భారీ మెజారిటీ గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అభ్యర్థులకు టికెట్ విషయంలో పార్టీ అనేక అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు అమిత్ షా. టికెట్ దక్కని నేతలపై కళంకితులేమీ కాదని.. వాళ్లపై పార్టీకి ఎప్పుడు గౌరవం ఉంటుందన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని.. తరంలో మార్పు చేయాల్సి ఉందన్నారు. సిట్టింగ్ నేతలు కళంకితమయ్యారనే ఊహాగానాలు నమ్మవద్దని కేంద్ర మంత్రి కోరారు. కర్ణాటక బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమై పార్టీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించారు.
2018లో జరిగిన ఎన్నికల్లో 224 సీట్లలో బీజేపీ 104 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో, జేడీఎస్ 38 సీట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 112 సీట్లు దాటలేకపోయాయి. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే తరువాత కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను ఆకర్షించిన బీజేపీ.. వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
Also Read: LSG vs GT Updates: అన్నదమ్ముల మధ్య బిగ్‌ఫైట్.. టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Karnataka Elections: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చిన బీజేపీ.. అసలు కారణం చెప్పిన అమిత్ షా