జగన్ పాదయాత్రకు తొలి అడ్డంకి ఎదురైంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం అగ్రహానికి చేరుకున్న జగన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ మద్దతు ఇచ్చే వరకు పాదయాత్ర చేయడానికి వీల్లేదంటూ జగన్ ను అడ్డుకున్నారు. జగన్ నోటి నుంచి స్పష్టమైన వైఖరి తెలిపే వరకు యాత్రను తాము సాగనివ్వబోమని కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
జగన్ సిబ్బందితో వాగ్వాదం
వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది. నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ. 2004 ఎన్నికల్లో అధికారం చేపట్టి..పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేయాలని వైఎస్ కంకణం కట్టుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినందుకు వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాణయణరెడ్డి స్పందించారు. ఏపీకి కాబోయే సీఎం అంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని .. ఆయన్ను ఇలాగే వదిలేస్తే తెలంగాణకు సీఎం షర్మిల అవుతుందని...కాబోయే రాష్ట్రపతి విజయమ్మగా అవుతారని జగన్ ప్రచారం చేసుకుంటారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవ చేశారు.
వైసీపీ వైరస్ లాంటిది.....
ఎన్నికల ప్రణాళిక అంటే పుస్తకాలు రాయడం కాదు..హామీలు ఇచ్చి మరిచిపోవడం కాదు..వైసీపీ కేవలం రెండు పేజీల్లో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నూరుశాతం నెరవేరుస్తుందని వెల్లడించారు. ప్రజల సలహాలు, సూచనలతో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తామని జగన్ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు ఒక్కసారిగా తెరపైకి రావడం ఇప్పడు చర్చనీయంశంగా మారింది. పాదయాత్ర నేపథ్యంలో కనీసం వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ చేసిన అభ్యర్థను కూడా తోచిపుచ్చడం ఆయన విషయంలో ఏ స్థాయిలో ఉచ్చు బిగిస్తోన్నారో అర్థమౌతోంది. వాస్తవానికి జగన్.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోడీ సర్కార్ కు బేషరతుగా మద్దుతిచ్చారు. ఇప్పటి వరకు మోడీ సర్కార్ పై విమర్శలు చేయకుండా వస్తున్నారు. ఇంత చేస్తున్నా.. ఎందుకీ ఈ కేసు తెరపైకి వచ్చిందనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హోదాపై మాట్లాడినందుకేనా జగన్‌కు ఈ కష్టాలు ?
వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది. నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ. 2004 ఎన్నికల్లో అధికారం చేపట్టి..పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేయాలని వైఎస్ కంకణం కట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.