తెలంగాణ సీఎం షర్మిల, రాష్ట్రపతి విజయమ్మ

Last Updated : Nov 10, 2017, 06:39 PM IST
తెలంగాణ సీఎం షర్మిల, రాష్ట్రపతి విజయమ్మ

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినందుకు వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాణయణరెడ్డి స్పందించారు.  ఏపీకి కాబోయే సీఎం అంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని .. ఆయన్ను ఇలాగే వదిలేస్తే తెలంగాణకు సీఎం షర్మిల అవుతుందని...కాబోయే రాష్ట్రపతి విజయమ్మగా అవుతారని జగన్ ప్రచారం చేసుకుంటారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవ చేశారు.

వైసీపీ వైరస్ లాంటిది.....

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ లేకపోవడంతో చాలా ప్రశాంతంగా సభ నడుస్తోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు.. వైసీసీ వైరస్ లాంటిదని... వైరస్ లేకపోతే ఎంత బాగుంటుందో..సభలో వైసీపీ లేకపోవడం వల్ల కూడా అలాగే ఉందని ఆదినారాయణరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Trending News