ప్రజల సూచనలతో ఎన్నికల ప్రణాళిక - పాదయాత్రలో జగన్

Last Updated : Nov 6, 2017, 06:13 PM IST
ప్రజల సూచనలతో ఎన్నికల ప్రణాళిక - పాదయాత్రలో జగన్

ఎన్నికల ప్రణాళిక అంటే పుస్తకాలు రాయడం కాదు..హామీలు ఇచ్చి మరిచిపోవడం కాదు..వైసీపీ కేవలం రెండు పేజీల్లో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తుంది. 2019లో వైసీపీ అధికారంలోకి  వస్తే ఇచ్చిన హామీలన్నీ నూరుశాతం నెరవేరుస్తుందని వెల్లడించారు. ప్రజల సలహాలు, సూచనలతో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తామని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్న తనపై కక్ష సాధింస్తున్నారని ఆరోపించారు.  తనను రాజకీయాల నుంచి తప్పించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని..ప్రజల అభిమానంతో అలాంటి కుట్రలను తట్టుకొని నిలబడుతునన్నానని జగన్ వెల్లడించారు.

Trending News