పాదయాత్ర ముగింపు సభలో జగన్ సంధించిన అస్త్రాలు ఇవే 

పాదయాత్ర ముగింపు సభ వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు         

Last Updated : Jan 9, 2019, 05:49 PM IST
పాదయాత్ర ముగింపు సభలో జగన్ సంధించిన అస్త్రాలు ఇవే 

శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సభలో జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎంతదూరం నడిచామన్నది కాదు..ఎంత భరోసా ఇచ్చామన్నది ముఖ్యమన్నారు. తన పాదయాత్రలో పేదలు, వివిధ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చారననే సంతృప్తి ఉందని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా జగన్ తన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై  నిప్పులు చెరిగారు. రైతులు, పేదలుతో పాటు అన్ని వర్గాల ప్రజలు అసహ్యహించుకుంటున్నారని దయ్యబట్టారు..చంద్రబాబు హయంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..రైతు సమస్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇన్ పుట్ సబ్బీడీ ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ అని చెప్పి రైతన్నకు చంద్రబాబు మోసం చేశారు..గత ప్రభుత్వ హయంలో కంటే లక్షల ఎకరాల పంట సాగు దారుణంగా పడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోలేదు..గత ప్రభుత్వం చేసినట్లుగా రైతుల వడ్డీ డబ్బులు ప్రభుత్వం కట్టడం మానేశిందని విమర్శించారు..ఎన్నికల దగ్గరపడే కొద్ది చంద్రబాబుకు భయం పడ్డుకుంది..దీంతో రోజుకో డ్రామా ఆడుతున్నారు. ఎన్నికల ఆరు నెలల ముందు చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని జనగ్ ఎద్దేవ చేశారు

 
జగన్ విమర్శనాస్త్రాలు:
* నిరుద్యోగ భృతి పేరుతో యువతకు మోసం 
* ఫీజు రియంబర్స్ మెంట్ అందక చదువులు ఆపేసే పరిస్థితులు 
*  ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ..ఒక జాబు కూడా ఇవ్వలేదు
*  జాబు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల పీకేస్తున్నారు
* రుణమాఫీ అన్ని రైతులుకు మోసం చేశారు
* దళారి వ్యవస్థను పెంచి పోషించి..దానికి చంద్రబాబు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు
* రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం 
*డ్రాక్రా సంఘాల అప్పులు పెరిగాయి..
* రాష్ట్రంలో 6 వేల స్కూళ్లు మూయించారు
* రైతులు,దళితుల భూమలను దోసేశారు
* మరుగుదొడ్లు లేని స్కూళ్ల కాలేజీలు ఎన్నో ఉన్నాయి..దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు
*ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారు
* ఓవైపు రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు జాతీయ రాజకీయాలంటున్నారు.
* నాలుగేళ్లు మోడీ సర్కార్ తో కాపురం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాట దీక్ష అంటూ నాటకాలు చేస్తున్నారు

Trending News