టీం ఇండియాతో మ్యాచులంటే తమ ఆటగాళ్లకు భయం పట్టుకుందని ఆసీస్ తాత్కాలిక కోచ్ డేవిడ్ సాకెర్ అన్నారు. అయినా, టీ20లో పుంజుకోవాలనే పట్టుదలతో ఉన్నామని, సిరీస్ ను జారవిడుచుకోమని చెప్పారు. "మా ఆటగాళ్లు చాలామంది భారత్ తో భయంగా మ్యాచులను ఆడుతున్నారు. వరుస పరాజయాలు ఇందుకు కారణం అవ్వొచ్చు. ఆసీస్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలన్నదే మా కోరిక" అని చెప్పారు. భారత్ ఆసీస్ తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్నది. ఈసారి జట్టులో సగం మందికి పైగా ఆటగాళ్లను ప్రక్షాళన చేశారు. దీంతో ఫలితాలు మారవచ్చని సకేర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కంగారులను టీమిండియా తెగ కంగారు పుట్టిస్తోంది. ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన బంపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి293 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ఆసీస్ దూకుడు ప్రదర్శించినప్పటికీ చివర్లో భారత్ బౌలర్లు కంట్రోల్ చేయడంతో 300 లోపు స్కోరుకే పరిమితమైంది. ఆసీస్ బ్యాట్స్మెన్ ఫించ్ సెంచరీ(124)కి తోడు కెప్టెన్ స్మీత్ (62) , వార్నర్ (42) రాణించడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరు చేయగల్గింది. కాగా 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆది నుంచి చివరి వరకు ఎక్కడా తడబడలేదు.
నువ్వా నేనా అన్నట్లు సాగే భారత్-ఆసీస్ పోరు కోసం అందరం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ కు మరో ప్రత్యేకత ఉంది. ఈ పోరులో విన్నర్ గా నిలిస్తే అగ్రస్థానాన్ని కైవసం చేసుకు అవకాశం ఇరు జట్లకు ఉంటుంది. అయితే కనీసం 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ఎవరైతే ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటారో వారే టాప్ ర్యాంకు సాధిస్తారు. ప్రస్తుతం భారత్, ఆసీస్ చెరో 117 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. కాాగా 119 పాయింట్లతో సౌతాఫ్రికా జట్టు అగ్రస్థానంలో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.