మూడో వన్డేలోనూ టీమిండియా విన్..సిరీస్ కైవసం

Last Updated : Sep 28, 2017, 12:43 PM IST
మూడో వన్డేలోనూ టీమిండియా విన్..సిరీస్ కైవసం

కంగారులను టీమిండియా తెగ కంగారు పుట్టిస్తోంది. ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన బంపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి293 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ఆసీస్ దూకుడు ప్రదర్శించినప్పటికీ చివర్లో భారత్ బౌలర్లు కంట్రోల్ చేయడంతో 300 లోపు స్కోరుకే పరిమితమైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఫించ్ సెంచరీ(124)కి తోడు కెప్టెన్ స్మీత్  (62) , వార్నర్ (42) రాణించడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరు చేయగల్గింది. కాగా 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆది నుంచి చివరి వరకు ఎక్కడా తడబడలేదు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 13 బంతులు మిలిగిన ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి  టార్గెట్‌ను చేధించింది.

సిరీస్ భారత్ కైవసం..

భారత బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా రాణించడం వల్లే ఈ విజయం సాధ్యపడింది. ఓపెనర్లు (70), రోహిత్ (71) హాఫ్ సెంచరీలతో విజయానికి కావాల్సిన బలమైన పునాది వేశారు. అనంతరం రంగంలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్‌‌లు తమ వంతు భాధ్యత నిర్వర్తించారు. ప్రధానంగా హాట్ హిట్టర్ పాండ్యా (78) మరోసారి చెలరేగి భారత్‌‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నట్లయింది. శ్రీలంకను టీంమిండియా క్లీన్ స్వీప్ చేసినప్పుడు బలహీన జట్టుపై ప్రతాపం చూపడం గొప్పవిషయం కాదనే  కామెంట్స్ వచ్చాయి. అయితే ఆసీస్ లాంటి బలమైన జట్టుపై టీమిండియా అదేజోరు కొనసాగిస్తుండంతో విమర్శకులు సైతం..కోహ్లీసేనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

Trending News