ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలతో ముంబై తడిసిముద్దయింది. పలు ప్రంతాలు జలమయమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నయనే హెచ్చరికతో బయటకు వెళ్లవద్దంటూ ప్రజలకు హెచ్చరిక జారీ అయింది.
Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది.
Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landafll ).
దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసే నైఋతు ఋతుపవనాలు జూన్ 1న కేరళ రాష్ట్రంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ చల్లని కబురు తెలిపింది. కాగా భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నైరుతి
మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోవడంతో దేశ రాజధానిలో
ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు ఈదురుగాలులు, భారీ వర్షంతో అంతా అతలాకుతలమైంది. ఎంఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ లో 12 మంది మృతి చెందారు.
'ఎంఫాన్' తుపాన్ ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంఫాన్ తుపాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుపానుగా పరిణమించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ మనుషులు, జంతువులు, అన్ని రంగాలతో పాటు తాజాగా వాతావరణంపైనా ప్రభావం చూపిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కాస్తు ముందుగానే వర్షాలు కురవనున్నాయి.
కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో చలి వాతావరణం భయం పుట్టిస్తోంది. చలి ధాటికి రాజధాని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ(బుధవారం) ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోయాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి.
మహారాష్ట్రలో తెల్లవారుజామున భూకంపం వణికించింది. ఉదయం 5 గంటల 22 నిముషాలకు భూమి కంపించింది. పాల్ఘాట్ జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8 మెగ్నిట్యూడ్‌లుగా నమోదైంది. ఈమేరకు భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.