హైదరాబాద్: అరేబియా సముద్రంలో భారత తీరం వైపునకు కదులుతున్న తుపాను రాగల 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాన్ ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలో గత కొద్ది రోజులుగా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే, మరోవైపు కోస్తాంధ్రాలోనూ పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వర్షాల కారణంగా పంటలు సైతం నీటిపాలయ్యాయి.