ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలతో ముంబై తడిసిముద్దయింది. పలు ప్రంతాలు జలమయమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నయనే హెచ్చరికతో బయటకు వెళ్లవద్దంటూ ప్రజలకు హెచ్చరిక జారీ అయింది.
ముంబైకర్లకు ఇప్పుడు వర్షాల బెడద పట్టుకుంది.ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడుతున్న జనానికి భారీ వర్షాల హెచ్చరిక పట్టుకుంది. ఉదయం నుంచి ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. ట్రాఫిక్ లో వాహనాలు చిక్కుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చొరబడింది. రోడ్లపై మోకాలు లోతు నీళ్లు చేరుకున్నాయి. బస్టాండ్ లనీ నీటితో నిండిపోయాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు. నగర పౌరుల్ని బయటకు వెళ్లవద్దంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ ( IMD ) Also read: Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?
Maharashtra: Waterlogging in parts of Mumbai due to incessant rainfall; visuals from King's Circle area. Brihanmumbai Municipal Corporation (BMC) has requested people stay to away from the shore and not venture into waterlogged areas. pic.twitter.com/iMAL8yld5Y
— ANI (@ANI) July 15, 2020
ముంబైతో పాటు థాణే, పాల్ ఘర్ ఇతర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొంకణ్, ముంబై, థాణేలలో ఇవాళ అతి భారీ వర్షాలు పడవచ్చని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం నాడు ముంబైలో 86 మిల్లీమీటర్ల వర్షపాతం, కొలాబా స్టేషన్ ప్రాంతంలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ముంబైలోని శాంతాక్రజ్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు అతి భారీ వర్షాల హెచ్చరిక నేపధ్యంలో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వరకూ వర్షం కురవవచ్చని తెలుస్తోంది. ముంబై , ధాణేలతో పాటు కొల్హాపూర్, సతారా, ఔరంగాబాద్, జైనా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడవచ్చని అంచనా ఉంది. Also read: Rajasthan: బీజేపీకు నో చెప్పిన సచిన్ పైలట్
ఈశాన్య అరేబియా సముద్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయని ఐఎండీ తెలిపింది.